విశిష్ట వ్యాయామం

Durga
 ఆరోగ్యంవంతమైన జీవితాన్ని గడపటానికి చేపట్టే వ్యాయామ ప్రక్రియల్లో నడక ఒక విశిష్టమైన ప్రక్రియ. శరీర స్థితిగతులనుబట్టి పలు విధాలైన నడక ద్వారా ఆశించిన ఫలితాలను పొందవచ్చు. నడకకు చెందిన ప్రక్రియల్లో పవర్ వాకింగ్ అనే పద్దతిని ఒక ప్రత్యేక ప్రక్రియగా పేర్కొనవచ్చు. పవర్ వాకింగ్ వలన శరీరంలో నడుము పైబాగంలోని కండర సముదాయాలకు ఎయిరోబిక ప్రక్రియసౌలభ్యం కలుగుతుంది. అతి జోరుగా సాగే నడక కంటే పవర్ వాకింగ్ లో అత్యధిక పరిమాణంలో కండరాలు వ్యాయామ ప్రక్రియకు గురువుతాయి. తద్వారా కేలరీలవినిమయ శక్తి కూడా అధికంగానే ఉంటుంది. పవర్ వాకింగ్ చేసే వ్యక్తులు 12 నిమిషాల్లో ఒకటిన్నర కిలోమీటర్ల (దాదాపు ఒక మైలు ) దూరాన్ని నడవగలసామర్ధ్యం కలిగి ఉంటారు. సాధారణంగా ఈ సామర్థ్యాన్ని ఒక వారం రోజుల్లో సాధించవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: