వెన్నునొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పి వంటి కీళ్ల సమస్యలతో బాధపడుతున్నారా ? అయితే ఈ చిట్కాలు పాటించి చూడండి!!!

kalpana
ఆధునిక జీవన ప్రయాణంలో మానవుడు నిత్యం అనేక వ్యాధులతో పోరాటం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అలాంటి వాటిలో కీళ్ల సమస్యలు ప్రధానమైనది. వెన్ను నొప్పులు, భుజాల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి ఇలా రకరకాల రూపాల్లో ఈ కీళ్ల నొప్పుల  సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే ఈ కీలక సమస్యలను ఎదుర్కొనడానికి కొన్ని చిట్కాలను పాటించి చూడండి.
ఆహారంలో ఉప్పును అధికంగా  తీసుకోవడం తగ్గించాలి. ఉప్పు అధికంగా తీసుకుంటే కీళ్ల మధ్య లో ఉత్పత్తి అయ్యే జిగురు లాంటి పదార్థాన్ని ఇది అడ్డుకుంటుంది తద్వారా కీళ్ల సమస్యలు ఏర్పడతాయి.
ప్రతిరోజూ శారీరక శ్రమ చేయాలి. చెమట వచ్చేలా కొన్ని రకాల ఎక్సర్‌సైజ్‌లు, యోగా, లేక వ్యాయామం, జిమ్ లాంటివి చేస్తే స్వేదం ద్వారా లవణాలు బయటకు పెళ్లి కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.
మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు నువ్వులనూనెలో నిమ్మరసాన్ని కలిపి కీళ్లపై మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది
ఎముకలు దృఢంగా ఉండాలంటే క్యాల్షియం అధికంగా లభించే ఆహార పదార్థాలైన కోడిగుడ్లు, పల్లీలు బెల్లంతో చేసిన వంటకాలను ఎక్కువగా తినాలి.
అధిక బరువు కారణంగానూ మోకాళ్ల నొప్పులు, కీళ్ల సమస్యలు వస్తాయి. కనుక కాస్త బరువు తగ్గడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.
కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్న చోట వెల్లుల్లిరసంతో బాగా మర్దన చేయడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
ప్రతి రోజు ఒక గ్లాసు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసాన్ని కలుపుకొని త్రాగటం వలన కీళ్ల నొప్పి నుండి ఉపశమనాన్ని పొందుతారు.
ప్రతిరోజు 15 నుంచి 20 నిమిషాలు ఉదయం సూర్యరశ్మిలో  నిలబడితే మన శరీరానికి అవసరమైన విటమిన్ డి సహజసిద్ధంగా లభిస్తుంది తద్వారా ఎముకలు బలంగా ఉండి కీళ్ల సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
ఈ విధంగా కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా కీళ్లనొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: