తల్లిపాలను పెంచే, అద్భుతమైన ఆహారాలు.. అవి ఏమిటంటే.?
మెంతుల కషాయం చేసుకుని బాలింతలు తాగడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది.మెంతులతో చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా పాలు పెరుగుతాయి. తల్లిపాలు తాగిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.
తులసి లో ఔషధ గుణాలు మాత్రమే కాదు తల్లిపాలను ఉత్పత్తి చేసే గుణం కూడా ఉంది.తులసి లో విటమిన్ కే ఉంటుంది.తులసి ఆకులను సూప్ వేసి తాగవచ్చు. లేదా తేనెతో కలిపి తినవచ్చు.అలాగే పచ్చి ఆకులను తినడం వల్ల కూడా పాల ఉత్పత్తి పెరుగుతుంది.
కాకరకాయ, బీరకాయ వంటి కూరగాయల్లో పాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది.కూరగాయల్లో మినరల్స్,మరియు విటమిన్స్ అధికంగా ఉంటాయి.కాబట్టి వీటిని ఉడికించే కారం లేకుండా తీసుకున్నట్లయితే పాలు పెరుగుతాయి.
ఆవు పాలు, నెయ్యి, బటర్ వంటివి తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది.పచ్చిపాలను తీసుకోకుండా కర్రీస్ ల తీసుకోవడం మంచిది.కర్బూజ పండు, జీలకర్ర,పాలకూర,బార్లీ జావ, బొబ్బర్లు మునగాకు కూరలు తీసుకోవడం వల్ల పాలు బాగా పెరుగుతాయి.
వెల్లుల్లి తినడం వల్ల కూడా పాలు పెరుగుతాయి.వెల్లుల్లిని పొడిచేసుకుని కానీ, కూరలో వేసుకొని కానీ,మటన్ లోగానే వేసుకొని తినవచ్చు.ఇలా రోజు తిన్న ఎలాంటి ప్రమాదం ఉండదు.
బాలింతలు రోజు వామును తేనెతో కలుపుకొని తాగడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. శనగలను మొలకలు వచ్చేవరకూ నానబెట్టి బాగా ఎండబెట్టి దోరగా వేయించి పొడికొట్టి పెట్టుకోవాలి.పొడినే కషాయంలా చేసుకుని తాగడం వల్ల పాలు బాగా పెరుగుతాయి.