గసగసాలు లో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి.. అవి ఏమిటి.?
శరీరంలో అధిక వేడి ఉంటే చలువ చేయడానికి గసగసాలు బాగా పనిచేస్తాయి. ఎలాగంటే 10 గ్రాముల గసగసాలు కొన్ని నీళ్లు పోసి మెత్తగా నూరి ఇందులోకి పటిక బెల్లం కలిపి రోజు తింటుంటే ఉష్ణము తగ్గిపోతుంది.
తలలో చుండ్రు పోయి వెంట్రుకలు ఆరోగ్యంగా పెరగాలంటే గసగసాలతో ఈ విధంగా చేయాలి. గసగసాలను నీళ్ళల్లో నానబెట్టి మెత్తగా రుబ్బి తలకు బాగా పట్టించి ఆరిన తర్వాత కుంకుడు కాయ రసం తో స్నానం చేయాలి.ఈ విధంగా చేయడం వల్ల చుట్టూ తగ్గిపోయి వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి.
పది గ్రాములు గసగసాలు,10 గ్రాములు యాలకులు,10 గ్రాముల సోంపు గింజలు.మూడింటిని కలిపి 60 గ్రాములు నెయ్యి వేసి చిన్న మంట మీద నీళ్లు పోయి నెయ్యి మిగిలే వరకు మరగించాలి.చల్లారిన తర్వాత ఒక డబ్బాలో నిల్వ చేసుకొని,రోజు తలకు రాసుకుంటే,తల దిమ్ము, తలనొప్పి పార్శ్వపు నొప్పి తగ్గిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
గర్భిణీలకు వచ్చే రక్త జిగట విరేచనాలు తగ్గిపోవడానికి గసగసాలు వాడొచ్చు. ఎలా వాడాలి అంటే 10 గ్రాములు గసగసాలు, 20 గ్రాముల పటిక బెల్లం పొడి కలిపి మెత్తగా నూరి నిల్వ ఉంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని 5 గ్రాముల మోతాదులో 20 గ్రాములు వెన్న కలుపుకొని రోజుకు రెండు పూటల తింటుంటే రక్త జిగట విరేచనాలు తగ్గిపోతాయి.
నిద్ర సరిగా రాకపోతే వేడి చేసిన గసగసాలు ఒక వస్త్రంలో మూటకట్టి వాసన చూస్తూ ఉంటే నిద్ర బాగా పడుతుంది.