ఖర్జూర పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..?

kalpana
కొన్ని పండ్లు సీజనల్ లో మాత్రమే దొరుకుతాయి. కానీ ఖర్జూరపు పండ్లు అన్ని సీజన్లోనూ దొరుకుతాయి. ఈ పండ్లను చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా ఇష్టపడి తింటారు. ఖర్జూరపు పండ్ల లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.ఇవి తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూర పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
 ఖర్జూరపు పండ్ల లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి మలబద్ధకాన్ని నివారిస్తుంది.ఇందులో పోషకాలు కూడా పోగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన గ్లూకోజ్ను అందిస్తాయి.
 శరీరానికి అవసరమయ్యే పొటాషియం,  మెగ్నీషియం,క్యాల్షియం, ఐరన్అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ పండ్లు తినడం వల్ల శరీరానికి చాలా మంచిది.
 ఖర్జూరపు పండ్ల లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి చలికాలంలో తినడం వల్ల శరీరానికి తగినంత వేడిని అందిస్తాయి. ఇంకా రోగ నిరోధక శక్తి పెరగడానికి సహాయపడతాయి.
 ప్రతిరోజు రెండు ఖర్జూరాలను తినడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను బయటకు పంపడమే కాకుండా గుండెకు సంబంధించిన వ్యాధులను రాకుండా కాపాడుతాయి.
 గర్భిణీలు ఖర్జూర పండ్లు తీసుకోవడం వల్ల శిశువుకు అవసరమైన ఐరన్, క్యాల్షియం లభిస్తాయి. ఇవి శిశువు ఎదుగుదలకు తోడ్పడుతాయి.
 పోషకాలు ఎక్కువగా ఉన్న ఖర్జూర పండ్లను ప్రతిరోజు రెండు తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది.రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా జరుగుతుంది.
ఈ పండ్లను తీసుకోవడం వల్ల రక్తపోటు ఎక్కువగా ఉన్న వాళ్లకి కంట్రోల్ అవుతుంది.
ఈ పండ్లు తినడం వల్ల  పేగు సమస్యలు దూరమవుతాయి.ఈ పండు గుజ్జు తీసుకోవడం వల్ల గొంతు నొప్పి,మంట, జలుబు, వంటివి కూడా తగ్గుతాయి.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                         
.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: