రోగనిరోధక శక్తి పెంచే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా..?

Suma Kallamadi

మన ఆరోగ్యం మొత్తం మనము ఏం తింటున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. అందుకే మనం తినే ప్రతి ఆహార పదార్థాలు గురించి పూర్తి అవగాహన కలిగి వుండాలి. ఏమి తినకూడదో ఏమి తినాలో అనే అవగాహన లేకపోతే మీ జీవితంలో ఆరోగ్యం పూర్తిస్థాయిలో మెరుగుపడదు. అయితే ఈ రోజు ఈ ఆర్టికల్ ద్వారా మేము ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన పోషక ఆహార పదార్థాలను చెప్పబోతున్నాము. ఈసారి మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఈ పదార్థాలను కొనుక్కునేందుకు ప్రయత్నించండి. 


1. భారత దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించగా... ఎవరు బయటకు వెళ్ళకుండా ఇంటికే పరిమితం అవడం వలన భౌతిక శ్రమ మీ శరీరాలకు అందదు. ఫలితంగా మీకు అలసట ఎక్కువ అవుతుంది. మీ అలసట పోగొట్టుకునేందుకు పిండి పదార్థాలు ఎక్కువగా తినాలి. పిండిపదార్థాలు తింటే మీకు రోజంతా చురుకుగా ఉండటానికి శక్తిని ఇస్తాయి. గోధుమ, జోవర్, బజ్రా లాంటివి తీసుకోవడానికి ప్రయత్నించండి. 

 

2. రోగనిరోధక శక్తి పెరగాలంటే మన శరీరానికి ప్రోటీన్లు సరిపడా అందాలి. నిజమేమిటంటే ప్రతిరోధకాలు (శరీర పోరాట యోధులు) ప్రోటీన్‌తో తయారవుతాయి. అందుకే మీరు ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం పదార్థాలైన పప్పుధాన్యాలు, పల్చటి మాంసం, గుడ్లు, డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువగా తినేందుకు ప్రయత్నించండి. 

 

3. మన శరీరంలోని నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే ఫ్యాట్స్ మన శరీరానికి తగినంత అందడం చాలా ముఖ్యం. ఫ్యాట్స్/ కొవ్వు కలిగిన పదార్థాలు తినడం వల్ల ఆహార పదార్థాలలోని విటమిన్లు శరీరానికి చక్కగా ఒంటికి పడతాయి. కానీ నట్స్, గుడ్లు, మాంసం, కొబ్బరి నూనె, నువ్వుల నూనె వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను ఎంచుకోవడం గుర్తుంచుకోండి.


4. సి, డి విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా బాగా దోహదపడతాయి. విటమిన్ సి శ్వాసకోశ వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఇళ్లకే పరిమితం కాగా వారికి సూర్యరశ్మి నుంచి ఏ విటమిన్లు అందవు. అందువల్ల వారి శరీరంలో విటమిన్ డి స్థాయిలు పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ మీరు సూర్యరశ్మిలో అసలు తిరగకపోతే విటమిన్ డి అధికంగా ఉండే ఆహారమైన కివి, ఆరెంజ్, పాలను ఎక్కువగా స్వీకరించండి. అలాగే ఆకుపచ్చ ఆకుకూరలలో కాల్షియం, జింకు, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఇది మీరు తరచూ తీసుకోవడం వల్ల మీలో రోగనిరోధక శక్తి సూపర్ గా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: