దానిమ్మ పండు తినటం వలన కలిగే ప్రయోజనాలు తెలుసా...?
ఏ సీజన్లో అయినా దొరికే పండ్లలో దానిమ్మ పండు కూడా ఒకటి. దానిమ్మ పండ్లలో శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్నో ఉన్నాయి. మెగ్నీషియం, విటమిన్ బి6, ఐరన్, విటమిన్ సి, క్యాల్షియం, ఫైబర్, పొటాషియంలాంటి ఎన్నో పోషకాలు దానిమ్మ పండ్లలో లభిస్తాయి. దానిమ్మ పండ్లలో ఉండే విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్ల వలన క్యాన్సర్లు రావు. దానిమ్మ పండ్లు రోజూ తినేవారిలో చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వస్తుంది.
సంతానం లేని వారు దానిమ్మ పండును తింటే శృంగార సమస్యలు పోవడమే కాకుండా శక్తి పెరుగుతుంది. దానిమ్మ పండ్లు తినే వారిలో రోగ నిరోధక శక్తి పెరిగి రోగాల నుండి రక్షణ లభిస్తుంది. స్త్రీలు దానిమ్మ పండ్లు తింటే రుతుక్రమం సక్రమంగా అవుతుంది. దానిమ్మ పండ్లు రోజూ తినేవారిలో రక్త నాళాలలో అడ్డంకులు తొలగిపోయి బాక్టీరియా, వైరస్ ఇన్ ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
దానిమ్మ పండ్లు తినేవారిలో ఎముకలు ధృడంగా మారటంతో పాటు రక్త సరఫరా బాగా పెరిగి రక్త నాళాల్లో ఉండే సమస్యలు తగ్గుతాయి. దానిమ్మ పండ్లు తినే వారిలో దంత సమస్యలు రావు. దానిమ్మ పండ్లు తింటే చిగుళ్ల వాపులు, నొప్పుల సమస్యలతో బాధ పడేవారికి ఆ సమస్యలు తగ్గుతాయి. దానిమ్మ పండ్లు తింటే చర్మం కాంతివంతంగా మృధువుగా మారుతుంది. డయేరియా సమస్యతో బాధ పడేవారు దానిమ్మ పండ్లు తింటే సమస్య తగ్గుముఖం పడుతుంది.