ఎక్కువ సేపు శృంగారం చేయాలంటే..? ఇలా చేయండి..!

Chakravarthi Kalyan

శృంగారం భార్యాభర్తలను కలిపి ఉంచే ప్రధాన బంధం. కానీ శృంగారంలో భార్యాభర్తలకు కమ్యూనికేషన్ లేకపోతే.. ఆ సంసారం చిటపటల సంసారమే అవుతుంది. ఇక శృంగారం విషయంలో కొందరు భర్తలు ఎక్కువ సేపు శృంగారం కొనసాగించలేరు. దీంతో అసంతృప్తికీ, ఒత్తిడికీ లోనవుతారు. అసలు ఇలా జరగడానికి కారణమేంటి? ఈ సమస్యను సరిచేసేదెలా ? తెలుసుకుందాం.

 

ప్రతి పురుషుడికీ ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఇబ్బందే ఇది! అంగం పటుత్వం తగ్గడానికి ఎన్నో కారణాలుంటాయి. మానసిక ఆందోళన, పని ఒత్తిడి, అలసటం, అధిక మద్యపానం, బాంధవ్యపరమైన సమస్యలు.. అయితే ఈ సమస్య మరీ తరచుగా వేధిస్తుంటే ‘ఎరెక్టయిల్‌ డిస్‌ఫంక్షన్‌’గా భావించాలి. అంగం గట్టిపడకపోవడం, గట్టిపడినా ఎక్కువసేపు ఆ స్థితిలో ఉండకపోవడాన్ని ‘ఎరెక్టయిల్‌ డిస్‌ఫంక్షన్‌’ అంటారు.

 

స్వయంతృప్తి పొందే సమయంలో గట్టిపడుతూ పార్ట్‌నర్‌తో సెక్స్‌లో పాల్గొనే సమయానికి గట్టిపడకపోవడం లాంటి కొన్ని సందర్భాలూ ఉంటాయి. దీన్ని ఎరెక్టయిల్‌ డిస్‌ఫంక్షన్‌ అని చెప్పలేం! పూర్తిగా స్తంభన కోల్పోయినప్పుడే సమస్యగా భావించాలి. అందుకే అంగ స్తంభన కోల్పోవడానికి అసలు కారణాన్ని ఎంత త్వరగా కనుక్కోగలిగితే అంత మేలు. కాబట్టి ఈ సమస్య కనిపిస్తే ఆలస్యం చేయకుండా తగిన సెక్సాలజిస్ట్‌ని సంప్రతించండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: