ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగాలు

Suma Kallamadi
మీ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడం దగ్గర నుండి జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరచే వరకు, ఆపిల్ సైడర్ వెనిగర్ అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది. ఇప్పుడు ఆపిల్ సైడర్ వెనిగర్ యొక్క కొన్ని లాభాలను తెలుసుకుందామా మరి.


మొదటగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది : ఆపిల్ సైడర్ వెనిగర్ మీ శరీరంలో ఉన్న అదనపు కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మీ ఆకలిని అణచివేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది. వెనిగర్లో ఉండే పెక్టిన్, కణజాలాలను బంధిస్తుంది మరియు శరీరం నుండి అదనపు కొవ్వులను తొలగిస్తుంది. అనవసరమైన కేలరీలను కరిగించడం ద్వారా, మీ జీవక్రియలు కూడా మెరుగుపడుతాయి. ఫలితంగా శరీరం పనితీరు మెరుగుపడుతుంది. 


రక్తంలోని చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది : ఆపిల్ సైడర్ వెనిగర్లో ఉండే డైటరీ ఫైబర్ నిక్షేపాలు, రక్తంలోని గ్లూకోజ్ హెచ్చుతగ్గులను నియంత్రించడానికి సహాయపడుతుంది. అదేవిధంగా టైప్ 2 డయాబెటిస్తో బాధపడే వారిలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, రెండు టేబుల్ స్పూన్ల డైల్యూటెడ్ ఆపిల్ సైడర్ వెనిగర్ రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడగలదు.


యాసిడ్ రిఫ్లెక్షన్ సమస్యను నివారిస్తుంది : ఆపిల్ సైడర్ వెనిగర్ చాలాకాలం నుండి, ఆసిడ్ రిఫ్లెక్షన్ సమస్యకు ఒక మంచి ఉపాయంగా చెప్పబడుతుంది. క్రమంగా చాతీ మంట మరియు వికారం వంటి ఆసిడ్ రిఫ్లెక్షన్ లక్షణాల చికిత్సలో అద్భుతంగా సహాయపడుతుందని చెప్పబడుతుంది.


కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిస్తుంది : ఆపిల్ సైడర్ వెనిగర్లో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ తో పాటు అసిడిక్ ఆమ్లం ఉన్న కారణంగా, కొలెస్ట్రాల్ నిర్వహణలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రెండు సమ్మేళనాలు, LDL (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి మరియు HDL (మంచి) కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచటానికి సహాయపడతాయి.

 గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది : పైన చెప్పినట్లుగా, ఆపిల్ సైడర్ వెనిగర్ కొలెస్ట్రాల్ నిర్వహించడానికి లాభదాయకంగా ఉంటుంది, ఇది నేరుగా గుండె ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. అంటే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచడం ద్వారా వెనిగర్ మీ హృదయ వ్యవస్థను సంరక్షించగలదని చెప్పబడింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: