జ‌న‌వ‌రి 4వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

Spyder
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో జ‌న‌వ‌రి 4వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు..
1988:గామిట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్‍ఫర్ అనే ప్రక్రియ ద్వారా భారతదేశపు మొట్టమొదటి శిశువు జననం.
ప్ర‌ముఖుల జననాలు
1643: ఐజాక్ న్యూటన్, భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. (మ.1727) ఒక ఆంగ్లేయ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. ఒక సిద్ధాంత కర్త, తత్వవేత్త కూడా. ఈ ప్రపంచంలో అందరి కంటే గొప్ప శాస్త్రజ్ఞుడని కొనియాడదగిన వాడు. ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం, అది సైన్సుగా ఎలా పరిణామం చెందింది? అన్న అంశంపై ఆయన ఎనలేని కృషి చేశారు. అందువలననే ఆధునిక ప్రపంచం న్యూటన్ను సైన్సు పితామహుడిగా గౌరవస్తుంది.
1809: లూయీ బ్రెయిలీ, ఫ్రెంచ్ విద్యావేత్త, బ్రెయిలీ లిపి సృష్టికర్త. (మ.1852)
1915: పాకాల తిరుమల్ రెడ్డి, చిత్రకారుడు. (మ.1996) చిత్రకళారంగంలో పి.టి.రెడ్డి గా చిరపరిచితుడు. అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన చిత్రకారుల్లో పి.టి.రెడ్డి ముఖ్యుడు. ఆరు దశాబ్దాలుగా చిత్రకళారంగంలో అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు ఆయన. మరణించే వరకు కుంచెలను రంగరించిన తెలంగాణ చిత్రకారుడాయన.
1926: కోటంరాజు సత్యనారాయణ శర్మ, బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు రచయిత.
1942: మెట్ల సత్యనారాయణ రావు, రాజకీయనాయకుడు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (మ.2015)
1945: ఎస్.కె. మిశ్రో, నటుడు, నాటక రచయిత, దర్శకుడు.
1957: గురుదాస్ మాన్, పంజాబ్ కు చెందిన గాయకుడు, రచయిత, నృత్య దర్శకుడు,, నటుడు.
1963: మే-బ్రిట్ మోసర్, నార్వే దేశానికి చెందిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త, నోబుల్ బహుమతి గ్రహీత.
1984: జీవా, భారతీయ నటుడు.
ప్ర‌ముఖుల మరణాలు..
1974: గోపాలస్వామి దొరస్వామి నాయుడు, ఇంజనీరు,"భారతదేశపు ఎడిసన్"గా పేరొందాడు.. (జ.1893)
2007: కోరాడ నరసింహారావు, కూచిపూడి నాట్యాచార్యుడు. (జ.1936)
2015: ఆహుతి ప్రసాద్, తెలుగు సినీ నటుడు. (జ.1958)
2016: సరోష్ హోమీ కపాడియా భారత సుప్రీం కోర్టు 38వ ప్రధానన్యాయమూర్తి. (జ.1947)

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: