సెప్టెంబ‌ర్ 13కు చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

Spyder
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో సెప్టెంబ‌ర్‌13వ  ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు

1948: హైద్రాబాద్ పైకి పటేల్ సైన్యాన్ని పంపాడు.

జననాలు
1910: వేపా కృష్ణమూర్తి, తెలుగు ఇంజనీరు. (మ.1952)తెలుగువాడైన సుప్రసిద్ద ఇంజనీరు. నైజాం, ఆంధ్ర ప్రాంతాలలో ఇంజనీరుగా పనిచేశాడు. ప్రాణం కన్నా విధి నిర్వహణే మిన్నగా భావించి, ఆ విధి నిర్వహణలోనే ప్రాణాలు వదిలిన త్యాగమూర్తి.
1913: సి.హెచ్. నారాయణరావు, తెలుగు సినిమా నటుడు. (మ.1984). 1940 నుంచి 1950 దాకా ఓ దశాబ్ద కాలం పాటు తెలుగు సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన సినిమా నటుడు. చిత్తూరు నాగయ్య, వేమూరి గగ్గయ్య, కన్నాంబ, ఋష్యేంద్రమణి, సురభి బాలసరస్వతి వంటి కళాకారులు సినిమా రంగంలో ప్రవేశించక ముందు నాటకరంగాన్ని పరిపుష్టం చేసినవారే. అందుకు భిన్నంగా ఎలాంటి నాటకానుభవం, సిఫారసు లేకుండా సినీరంగంలోకి ప్రవేశించి స్వయంకృషితో నటుడుగా పేరు తెచ్చుకొన్న వ్యక్తి సి.హెచ్‌.నారాయణరావు. వాహినీవారు భక్తి రసాత్మకమైన చిత్రం ‘భక్తపోతన’ (1944) ను విడుదల చేసారు. అందులో రెండు మూడు సార్లు శ్రీరాముడు ప్రత్యక్షమవుతాడు. ఆ శ్రీరాముడ్ని చూసి ప్రేక్షకులు తన్మయులైనారు. అంతకుముందు అంత అందమైన, ఆకర్షణీయమైన శ్రీరామచంద్రుడ్ణి చూడలేదు.
1926: జి.వరలక్ష్మి, తెలుగు సినిమా నటి. (మ.2006)
1940: సజ్జా జయదేవ్ బాబు, కార్టూనిస్టు.
1946 : రామస్వామి పరమేశ్వరన్, భారత సైనిక దళం నకు చెందిన సైనికాధికారి.
1960: kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, 16వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 1960, సెప్టెంబర్ 13న నల్లారి సరోజమ్మ, అమరనాథరెడ్డిలకు హైదరాబాదులోజన్మించాడు. నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయాలలో బీకాం, ఎల్ఎల్‌బీ చదివాడు. నిజాం కళాశాల విద్యార్థి సంఘ నాయకునిగా పనిచేశాడు. రాష్ట్రం తరఫున రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈయన కెప్టెన్గా వున్నప్పుడు జట్టులోని ప్రముఖులలో అజారుద్దీన్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హర్షా భోగ్లే - ప్రఖ్యాత క్రికెట్ వ్యాఖ్యాత ఉన్నారు. 2010-నవంబరు 25 న 16 వ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి 2014 ఫిబ్రవరి 19 వరకు పదవిలో కొనసాగారు.
1966: శ్రీ, సంగీత దర్శకుడు, గాయకుడు. (మ.2015)

మరణాలు
1929: జతీంద్ర నాథ్ దాస్, స్వతంత్ర సమరయోధుడు, విప్లవవీరుడు. (జ.1904)
1989: ఆచార్య ఆత్రేయ, తెలుగులో నాటక, సినీ రచయిత. (జ.1921)
1966: దేవరాజు వేంకటకృష్ణారావు, పత్రికా సంపాదకుడు, రచయిత, ప్రచురణకర్త. (జ.1886)
2012: రంగనాథ్ మిశ్రా, 21వ భారత ప్రధాన న్యాయమూర్తి. (జ.1926)

పండుగలు , జాతీయ దినాలు
అంతర్జాతీయ చాకోలెట్ దినోత్సవం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: