చింత చిగురు: ఆరోగ్యానికి ఎంత మేలంటే..?

Purushottham Vinay
చింత చిగురు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మనకు గ్రామీణ ప్రాంతాల్లో చాలా పుష్కలంగా లభిస్తుంది. ఈ చింత చిగురు మనకు చాలా మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల చాలా పోషకాలను మనం పొందవచ్చు. అలాగే దీనివల్ల పలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. చింత చిగురును తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.మలేరియా వంటి జ్వరాలు వచ్చిన వారు చింత చిగురు రసం తాగుతుంటే చాలా తొందరగా కోలుకుంటారు. జ్వరం కూడా ఈజీగా తగ్గుతుంది. ఈ ఆకుల వల్ల రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దీంతో వ్యాధులు చాలా త్వరగా తగ్గుతాయి.ఇంకా అలాగే ఇన్‌ఫెక్షన్ల నుంచి బయట పడతారు. చింత చిగురును తినడం వల్ల డయాబెటిస్ సులభంగా అదుపులో ఉంటుంది. షుగర్ లెవల్స్ కూడా నియంత్రణలోకి వస్తాయి.టైప్ 1 లేదా 2 ఏ డయాబెటిస్ అయినా సరే తగ్గుతుంది.అలాగే పచ్చ కామెర్లు వచ్చిన వారు ఈ ఆకులను తింటుంటే మంచి గుణం కనిపిస్తుంది.చాలా ఈజీగా కామెర్ల నుంచి కోలుకుంటారు.


ఇంకా అలాగే గాయాలు అయిన వారు చింత చిగురు పేస్ట్‌ను రాస్తున్నా లేదా ఈ ఆకులను తింటున్నా చాలా త్వరగా గాయాల నుంచి కోలుకుంటారు. పుండ్లు కూడా ఈజీగా తగ్గుతాయి. చర్మ సమస్యల నుంచి ఈజీగా బయట పడవచ్చు. కొందరికి విటమిన్ సి లోపించడం వల్ల దంతాలు, చిగుళ్ల నుంచి రక్తం అనేది కారుతుంది. కానీ చింత ఆకులను తింటే ఈ సమస్య నుంచి చాలా ఈజీగా బయట పడవచ్చు.దీంట్లో విటమిన్ సి కూడా పుష్కలంగా లభిస్తుంది.అలాగే పాలిచ్చే తల్లులు చింత ఆకులను తినడం వల్ల పాలు బాగా పడతాయి. అలాగే స్త్రీలు రుతు సమయంలో కలిగే నొప్పుల నుంచి ఇంకా అధిక రక్తస్రావం నుంచి బయట పడవచ్చు. ఈ ఆకులను తినడం వల్ల శరీరంలోని నొప్పులు, వాపులు ఈజీగా తగ్గుతాయి.దంతాల నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా ఇంకా ఆరోగ్యంగా మారుతాయి. ఇలా చింత చిగురు వల్ల మనం చాలా లాభాలను పొందవచ్చు. కాబట్టి ఇది లభించినప్పుడు దీన్ని తినడం మరిచిపోకండి. దీంతో పప్పు లేదా పచ్చడిని కూడా చేసుకోవచ్చు. లేదా చికెన్‌, మటన్‌, రొయ్యలు వంటివి కలిపి కూడా వండుకోవచ్చు. ఎలా వండినా కూడా ఈ చింత చిగురు పడితే ఆ కూర రుచి బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: