ఈ వేపుడు ఆరోగ్యానికి చాలా మంచిది?

Purushottham Vinay
క్యాబేజ్ మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల కూడా మన ఆరోగ్యానికి ఖచ్చితంగా మేలు కలుగుతుంది.క్యాబేజ్ ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా ఈజీ.ఈ క్యాబేజ్ వేపుడును మనం మరింత రుచిగా ఇంకా సింపుల్ గా కూడా తయారు చేసుకోవచ్చు. మసాలా పొడి వేసి చేసే ఈ క్యాబేజ్ వేపుడు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది.మసాలా పొడి వేసి మరింత రుచిగా క్యాబేజ్ వేపుడును ఎలా తయారు చేసుకోవాలో పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా మీరు క్యాబేజిని తురిమిని దానిని శుభ్రంగా కడిగి పూర్తిగా నీళ్లు లేకుండా చేసుకోవాలి. తరువాత కళాయిలో శనగపప్పు, ధనియాలు ఇంకా ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించాలి. ఆ తరువాత జీలకర్ర వేసి వేయించాలి. ఇప్పుడు మీరు వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇంకా ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. ఆ తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. ఇక నూనె వేడయ్యాక తాళింపు దినుసులు కూడా వేసి వేయించాలి.


ఆ తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఉల్లిపాయలు వేసి వేయించాలి.ఇక ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తరువాత పసుపు వేసి బాగా కలపాలి. తరువాత క్యాబేజి తురుము కూడా వేసి కలపాలి. అలాగే ఇందులోనే తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.ఇక దీనిని మధ్య మధ్యలో కలుపుతూ క్యాబేజి మెత్తబడే దాకా బాగా ఉడికించాలి.ఆ తరువాత మూత తీసి నీరంతా పోయే దాకా వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పొడి వేసి దానిని కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉండే క్యాబేజ్ వేపుడు ఈజీగా తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ ఇంకా రోటీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే క్యాబేజ్ వేపుడు కంటే ఈ విధంగా తయారు చేసిన క్యాబేజ్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ క్యాబేజ్ ను ఇష్ఠపడని వారు కూడా దీనిని ఇష్టంగా తింటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: