మీల్ మేకర్స్ ఆరోగ్యానికి ఎంత మేలంటే..?

Purushottham Vinay
మీల్ మేకర్స్ ఆరోగ్యానికి ఎంత మేలంటే.. ?

చాలా మందికి కూడా సోయా చంక్స్‌ను తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది. వీటినే మీల్‌ మేకర్స్‌ అని కూడా అంటారు. వీటిని సోయా పిండితో వీటిని తయారు చేస్తారు.అందువల్లనే వీటిని సోయా చంక్స్ అని అంటారు.మీల్‌ మేకర్స్‌ను తయారు చేసే క్రమంలో సోయా గింజల నుంచి మొదట ఆయిల్‌ను వేరుచేస్తారు.ఇక ఆ తర్వాత మిగిలిపోయిన పిండిని మీల్ మేకర్స్‌ తయారీకి వినియోగిస్తారు. దీనిలో కూడా పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి.అయితే దీనిలో కొవ్వు ఉండదు. అందుకే దీన్ని వెజిటేరియన్ మీట్ అని పిలుస్తారు.అలాగే కొన్ని చోట్ల సోయా మీట్ అని కూడా పిలుస్తారు. వీటిని వెజ్‌ బిర్యానీలో వేస్తే మటన్‌ రుచిలా ఉంటుంది. వీటితో చేసిన వంటకాలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 


అందువల్లనే మటన్‌కు ప్రత్యామ్నాయంగా మీల్‌ మేకర్స్‌ను వంటకాల్లో చాలా ఎక్కువగా వినియోగిస్తుంటారు. వీటిని తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను నియంత్రించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి.అందుకే వీటిని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.ఇంకా అలాగే మీల్ మేకర్స్ ఆరోగ్యానికి ఎంత మేలంటే..ఈ సోయాబీన్స్‌లో ఆమెనో యాసిడ్స్ అనేవి చాలా పుష్కలంగా ఉండటం రక్తపోటును కూడా చాలా సులభంగా నియంత్రిస్తాయి.అంతేగాక ఇవి గుండెజబ్బులు, క్యాన్సర్లు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించే లక్షణం కలిగి ఉంటాయి. ఇంకా అలాగే వీటిలో ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉండటం వల్ల మాంసాహారం తినని వారికి ఇది చాలా మంచి ఎంపిక. దీనిలో ఫైబర్‌ కంటెంట్‌ అధికంగా ఎక్కువగా ఉంటుంది.ఇంకా మధుమేహం సమస్య ఉన్న వారు కూడా వీటిని తినవచ్చు.వీటిని తింటే చర్మం ఇంకా జుట్టు ఆరోగ్యంగా కూడా ఉంటాయి. కాబట్టి వీటిని ఖచ్చితంగా తీసుకోండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: