గుండె గట్టిగా ఉండాలంటే ఇవి తినండి?

Purushottham Vinay
గుండెకు బాగా మేలు చేసే ఆహార పదార్థాల ఇప్పుడు తెలుసుకుందాం.ఇక వెన్న తీసిన పాలతో చేసిన పెరుగు గుండెకు చాలా రకాలుగా మేలు చేస్తుంది. మెగ్నీషియం, క్యాల్షియం ఇంకా పొటాషియం ఇందులో పుష్కలంగా ఉంటాయి. అందుకే పెరుగు, మజ్జిగలు మీ ఫుడ్‌లో తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి.అలాగే అవిసె గింజల్లో అధికంగా ఉండే.. ‘ఒమెగా 3’ ఫ్యాటీ యాసిడ్లు అనేవి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తాయి. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ని ఈజీగా తగ్గిస్తాయి.ఇంకా అలాగే సముద్ర చేపల్లో చెడు కొవ్వు చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. గుండెకు మేలు చేసే మెగ్నీషియం ఇంకా పోటాషియం రక్తనాళాలు మెరుగ్గా పనిచేయటానికి, బీపీ తగ్గటానికి ఇంకా అలాగే గుండె బాగా కొట్టుకోవటానికి, వాపు ప్రక్రియ అదుపులో ఉండటానికి మంచిది.ఇక అలాగే పాలకూర రెగ్యూలర్‌గా తింటానికి ట్రై చేయండి. ఎందుకంటే దీని ద్వారా శరీరానికి నైట్రేట్లు యాడ్ అవుతాయి.


 వీటిని మన శరీరం నైట్రిక్‌ ఆక్సైడ్‌గా మారుస్తుంది. ఇది రక్త ప్రసరణ మంచిగా జరగడానికి ఇంకా అలాగే బీపీ అదుపులో ఉంచడానికి సాయపడుతుంది. దాని ఫలితంగా గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది. బచ్చలి కూర లాంటి ఆకుకూరలు కూడా గుండెకు అదనపు బలం ఇస్తాయి.అలాగే చిక్కుడు కూరను చాలామంది ఇష్టంగా తింటారు. చిక్కుడు కాయ తోలు కూడా గెండెకు ఎంతగానో చేస్తుంది. దీనిలో పొటాషియం, వృక్ష రసాయనాలతో పాటు అనేక పీచు పదార్థాలు ఉంటాయి. నీటిలో కరిగే పీచు రక్తంలో కొలెస్ట్రాల్‌ లెవల్ ఎక్కువ అవ్వకుండా కూడా చూస్తుంది.ఇంకా అలాగే దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతి రోజూ నిర్ణీత మోతాదులో కనీసం మూడు నెలల పైగా దానిమ్మ జ్యూస్ తాగితే, గుండెకు రక్త ప్రసారం అనేది బాగా జరుగుతుంది. దానిమ్మ పండు గుండె రక్తనాళాల్లో పేరుకుపోయే అడ్డంకులు (ప్లాక్స్)నూ చాలా ఈజీగా క్లీన్ చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: