వేసవి కాలంలో ఇది ఖచ్చితంగా తినండి?

Purushottham Vinay
బొప్పాయి చౌకైన పండ్లలో  ఒకటి. తక్కువ ధరకు లభిస్తుండటంతో చాలా మంది దీన్ని ఎంతగానో ఇష్టపడతారు. ఈ పండులో అన్ని పండ్ల కంటే పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, కెరోటిన్, విటమిన్ C వంటి ఖనిజాలు, అర్జినైన్ ఇంకా అలాగే కార్బైన్ వంటి ముఖ్యమైన పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. వేసవిలో కూడా ఎక్కువగా లభించే ఈ బొప్పాయి తింటే ఆరోగ్యానికి చాలా రకాలుగా లాభాలు కలుగుతాయి. ఆ లాభాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుకుందాం..బొప్పాయిలో ఉండే పాపైన్ అనే డైజెస్టివ్ ఎంజైమ్ జీర్ణ రుగ్మతలు ఇంకా మలబద్ధకాన్ని నివారిస్తుంది.ఇక అంతేకాదు భోజనం చేసిన తర్వాత తీసుకుంటే ఆహారం తేలికగా జీర్ణమై పొట్ట ఉబ్బరం అనేది కాకుండా ఉంటుంది.ఇంకా ఈ బొప్పాయిని రోజూ తినేవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ. కాబట్టి మీకు గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతి రోజూ బొప్పాయిని తినండి.


ఈ బొప్పాయిని తినడం వల్ల అందులో ఉండే అధిక పీచు శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్‌ను చాలా ఈజీగా తగ్గిస్తుంది. అలాగే బాగా పండిన బొప్పాయిని రోజూ తింటే క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది. అందుకు ప్రధాన కారణం ఇందులో ఉండే శక్తివంతమైన పోషకాలు. మీరు ఈ బొప్పాయిని రోజూ తీసుకుంటే శరీరం తాజాగా, దృఢంగా ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది.ఇక ఖచ్చితంగా బరువు తగ్గాలనుకునే వారికి బొప్పాయి పండు చాలా మంచిది.అందుకే బరువు తగ్గేందుకు ప్రతి రోజూ ఆహారంలో దీన్ని తీసుకోవడం వల్ల ఇందులోని పీచు ఆహారాన్ని తేలికగా జీర్ణమయ్యేలా చేసి మన శరీరంలో కొవ్వు పదార్థాలు ఉండకుండా చేసి కరిగించి ఊబకాయాన్ని చాలా ఈజీగా నివారిస్తుంది.ఇంకా అలాగే బొప్పాయిలో శక్తివంతమైన కెరోటిన్‌లు కూడా ఉంటాయి. ఇది కంటి సమస్యలను ఖచ్చితంగా నివారిస్తుంది. కాబట్టి మీ కంటి లోపాన్ని నివారించడానికి ప్రతిరోజూ కూడా కొద్దిగా బొప్పాయి పండుని తినండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: