దురద, పుండ్లు సమస్యలు తగ్గాలంటే?

Purushottham Vinay
చాలా మందికి కూడా దురదల కారణంగా చర్మంపై పుండ్లు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చర్మ సమస్యలను మనం ప్రారంభ దశలో ఉన్నప్పుడే గుర్తించి వాటికి ఖచ్చితంగా తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.  లేదంటే ఖచ్చితంగా ఈ చర్మ సమస్యలు శరీరమంతా వ్యాపించడంతో పాటు దీర్ఘకాలం మనల్ని ఎంతగానో వేధిస్తూనే ఉంటాయి. మనల్ని ఎంతగానో వేధించే ఈ చర్మ సమస్యలను కేవలం ఒక చిన్న చిట్కాను ఉపయోగించి నయం చేసుకోవచ్చు.దురదలు, దద్దుర్లలతో పాటు ఇతర చర్మ సమస్యలను తగ్గించే ఆ చిట్కా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి  మనం ముఖ్యంగా కాకరకాయను వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కాకరకాయలో యాంటీ ఫంగల్ ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చాలా పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే చేదు గుణం చర్మ సమస్యలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ముందుగా కాకరకాయను శుభ్రంగా కడిగి దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి.


ఇక ఆ తరువాత వీటిని జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ కాకరకాయ పేస్ట్ ను గిన్నెలోకి తీసుకోని ఆ తరువాత ఇందులో పావు టీ స్పూన్ పసుపును వేసి కలపాలి. ఆ తరువాత ఇందులో అర టీ స్పూన్ కొబ్బరి నూనెను కూడా వేసి కలపాలి.ఇలా ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చర్మంపై దురద ఇంకా అలాగే దద్దుర్లు వంటి సమస్యలు ఉన్న చోట రాయాలి. దీనిని రాసే ముందు చర్మాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు సమస్య ఉన్న ప్రాంతంలో చర్మాన్ని గోరు వెచ్చని నీటితో బాగా శుభ్రం చేసుకుని ఆ తరువాత కాకరకాయ మిశ్రమాన్ని మీరు రాసుకోవాలి. ఉదయాన్నే మరలా గోరు వెచ్చని నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా ఈ టిప్ పాటించడం వల్ల ఖచ్చితంగా ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా అన్ని రకాల చర్మ సమస్యలను మనం చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఈ టిప్ పాటించడం వల్ల చర్మంపై ఉండే ఇన్ఫెక్షన్ తగ్గి తిరిగి చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: