మూత్రాన్ని నిలుపుకుంటున్నారా.. అయితే ప్రమాదమే..?

Divya
ఎక్కడైనా మనం ప్రయాణం చేసేటప్పుడు..చాలామంది ప్రజలు ఎక్కువగా పబ్లిక్ టాయిలెట్లు మూత్ర విసర్జన చేయడం బహిరంగ ప్రదేశాలలో వాష్ రూమ్ కి వెళ్లడం వంటివి ఎక్కువగా ఉపయోగించడం లేదు. కొంతమంది ఇంటికి వెళ్లే వరకు మూత్రాన్ని ఆపుకుంటూ ఉంటారు. ఇలా ఆపుకోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు. వీటి గురించి ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అయితే కొన్ని సమయాలలో మూత్రాన్ని ఆపుకుంటూ ఉండటం వల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్స్ మూత్రనాలం సాగడం, మూత్రపిండాలలో రాళ్లు వంటివి ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందట. దీనివల్ల పలు అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి ఉంటుందట.. మూత్రాన్ని ఆపుకోవడం వల్ల ఆ ఒత్తిడి మొత్తం మన శరీరం పైన ఉండే కండరాల మీద పడుతుందట.

అంతేకాకుండా మూత్రం ఎక్కువసేపు అలాగే ఉంచడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా కూడా పెరిగిపోతాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇది మూత్ర నాలాలలో ఇన్ఫెక్షన్ కి చేర్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఇక అప్పుడప్పుడు మూత్రం లో రక్తం కనిపించడం విసర్జన సమయంలో మంటగా అనిపించడం నిరంతరం మూత్ర విసర్జన చేయవలసి రావడం, రంగు మారిన దుర్వాసన వచ్చిన, ఇలాంటివన్నీ నీరు తక్కువగా తాగినప్పుడే జరుగుతాయని వైద్యులు సూచిస్తున్నారు.

మూత్రాన్ని క్రమం తప్పకుండా ఆపుకోవడం వల్ల పలు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందట. అలాగే మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఇలా చేయడం చాలా ప్రమాదం ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మూత్రం ఆపు కోవడం మాత్రం అసలు చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుచేతనే మూత్రం వచ్చినప్పుడు క్రమం తప్పకుండా పోసుకోవాలి.. ప్రతి ఒక్కరూ కూడా రోజులో ఎంతటి నీరు తాగితే అంత ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మన శరీరంలో నీటి శాతం తక్కువగా ఉంటే పలు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: