గ్రే హెయిర్ రాకుండా ఉండాలంటే ఎలాంటి నూనెలు వాడాలో తెలుసా..!

Divya
ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు, జీవన విధానం వల్ల చాలామంది చిన్న వయసులోనే గ్రే హెయిర్ రావడంతో బాధపడుతున్నారు.దీనికి కారణం ఆహారపు అలవాట్లు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్,వంశపార్యంపర్యంగా
వైట్ హెయిర్ వస్తుంది.వీటన్నీటితో పాటు హెయిర్ కీ నూనెలు సరిగా అప్లై చేయకపోవడం కూడా వైట్ హెయిర్ రావడానికి దోహదం చేస్తుంది.ఆయుర్వేద చికిత్సలో భాగంగా,ఈ నూనెను తరుచూ వాడటం వల్ల, వయసు పెరిగిన కూడా గ్రే హెయిర్ రాకుండా కాపాడుకోవచ్చు. అలాంటి నూనెను ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఈ నూనె తయారీకోసం కావాల్సిన పదార్థాలు..
ఈ నూనె తయారీకోసం ముందుగా అరకేజీ ఉసిరికాయలు తీసుకుని, బాగా శుభ్రం చేసి,నీడలోనే ఆరనివ్వాలి.ఉసిరికాయలకు చెమ్మ అంతా పోయిన తర్వాత, ముక్కలు కట్ చేసి, అందులోని గింజలను తీసివేయాలి.అ తరవాత ఉసిరిముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తని మిశ్రమంలా తయారుచేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ మీద ఒక మందంపాటి గిన్నె పెట్టి, అందులో అరకప్పు కొబ్బరి నూనె,అరకప్పు నువ్వుల నూనె వేయాలి.మరియు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ మిశ్రమాన్ని వేసి వేడి చేయాలి. అందులోనే గుప్పెడు మందార పువ్వులు,గుప్పెడు లేత కరివేపాకును వేసి బాగా మరగనివ్వాలి.అయిల్ కలర్ మారిన తర్వాత స్టవ్ అప్ చేసి స్టైనర్ తో వడకట్టుకోవాలి.
అలా వచ్చిన ఆయిల్ ను ఒక సీసాలో  నిల్వ చేసుకుంటే నెలరోజుల పాటు వాడుకోవచ్చు.
వాడుకొనే విధానం..
 ఈ ఆయిల్ ను రాత్రి పడుకోబోయే ముందు, మాడుకు అప్లై చేసి బాగా మర్దన చేయాలి.దీన్ని రాత్రంతా అలానే ఉంచి, మరుసటి రోజు  ఉదయాన్నే మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు అప్లై చేయడం వల్ల జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ సక్రమంగా జరిగి,కేరొటీన్ అధికంగా ఊత్పత్తి అవుతుంది. దీనితో తొందరగా వైట్ హెయిర్ రాకుండా, జుట్టు ఆరోగ్యాంగా, దృఢంగా తయారవడానికి సహాయపడుతుంది.
దీనితో పాటు విటమిన్ లు కలిగిన ఆహారం తీసుకోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం వంటివి చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: