దొండకాయల వల్ల ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదలరు..!

Divya
ఈ చలికాలంలో ఎక్కువగా లభించే కాయగూరలలో దొండకాయ ఒకటి. ఇది రుచికి చేదుగా ఉండడం వల్ల చాలామంది దొండకాయని ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. కానీ దొండకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఈసారి ఎక్కడ కనిపించిన కొనుక్కొని మరి తింటారు. సాధారణంగా దొండకాయ, గుమ్మడికాయ కుటుంబానికి చెందినది. ఈ మొక్కలోని వేరు,కాండం, ఆకులు, కాయలు..ప్రతి ఒక్కటి ఎన్నో రోగాలను నయం చేయటానికి ఆయుర్వేద చికిత్సలోఎక్కువగా ఉపయోగిస్తుంటారు.ఈ దొండకాయ వల్ల కలిగె ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
 జీర్ణ సమస్యలు తగ్గించుకోవడానికి..
చాలామంది ఈ మధ్యకాలంలో తిన్నది సరిగ్గా అరుగుదల కాక అనేక సమస్యలకు గురవుతూ ఉన్నారు.అందులోనూ ముఖ్యంగా గ్యాస్ ఫార్మ్ అవడం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి రోగాలతో బాధపడుతున్నారు. అలాంటి వారికి వారానికి రెండుసార్లు దొండకాయతో తయారు చేసే ఆహార పదార్థాలను ఇవ్వడం వల్ల, ఇందులోని డైటరీ ఫైబర్స్ తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అయ్యేలా చేసి, జీర్ణశక్తిని పెంచుతాయి.అంతేకాక డైజేషన్ కానీ పదార్థాలను, మలం రూపంలో బయటకు పంపడానికి సహాయపడతాయి.
డయాభేటీస్ కంట్రోల్ చేయడానికి..
మధుమేహంతో బాధపడేవారు తరచూ దొండకాయని ఆహారంలో తీసుకోవడం వల్ల, ఇందులోని యాంటీ డయాబేటిక్ గుణాలు మరియు గ్లూకోస్-6-పాస్పెట్ రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ ని, క్రమబద్ధీకరిస్తాయి.అంతేకాక మధుమేహం తగ్గించడానికి న్యాచూరోపతి వైద్యంలో,దొండఆకుల జ్యూస్ విరివిగా వాడుతారు.
 ఎలర్జీ సమస్యలు తగ్గించుకోవడానికి..
 దొండకాయలు కానీ, దొండ ఆకుల జ్యూస్ ని గాని తరచూ తీసుకోవడం వల్ల, అస్తమా మరియు చర్మరోగం వంటి అలెర్జీ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇందులోని ఆల్కలాయిడ్స్, ఫ్లవనాయిడ్స్, స్టెరాయిడ్స్  ఆస్తమా వంటి రోగాలకు మంచి ఔషధంగా పనిచేస్తాయి.
 క్యాన్సర్ ని నిరోధించుకోవడానికి..
దొండకాయలను ఎక్కువగా మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల, ఇందులోని యాంటీ ఆక్సిడెంట్, మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు,క్యాన్సర్ కలిగించే ప్రీరాడికల్స్ తో పోరాడి, క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయి.
 కావునా ప్రతి ఒక్కరు తమ ఆహారంలో దొండకాయలను చేర్చుకోవడం చాలా ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: