కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యకు చెక్ పెట్టాలంటే..?

Purushottham Vinay
ఇక మారుతున్న జీవన శైలి, చెడు ఆహార అలవాట్ల కారణంగా మనం చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా చలికాలంలో అయితే జలుబు, దగ్గు లాగానే చాలా మంది కడుపు ఉబ్బరం ఇంకా మల బద్ధకంతో ఎక్కువగా బాధపడుతున్నారు.సాధారణంగా తక్కువ తిన్నా కడుపు ఫుల్ అయినట్లు అనిపిస్తే దాన్ని కడుపు ఉబ్బరం సమస్యగా భావించవచ్చు. ఇంకా అలాగే నిద్రలేమి సమస్య కూడా ఉబ్బరం ఇంకా అలాగే మలబద్ధకం సమస్యలకు ప్రధాన కారణంగా నిలుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతి రోజు వేధించే ఈ సమస్యకు ఓ చిన్న టిప్ ద్వారా చాలా ఈజీగా పరిష్కారం లభిస్తుంది.భోజనం చేసిన తర్వాత పాటించే చిన్న టిప్ తో ఉబ్బరం ఇంకా అలాగే మలబద్ధకం సమస్యలకు చాలా ఈజీగా చెక్ పెట్టవచ్చు. ఆ టిప్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.అయితే మన ఇంట్లో ఎప్పుడూ ఉండే అరటిపండుతో ఉబ్బరం ఇంకా మల బద్ధకం సమస్యకు చాలా ఈజీగా చెక్ పెట్టవచ్చు.


 ప్రతి రోజూ కూడా భోజనం చేసిన తరువాత ఓ అరటి పండును తింటే చాలా వరకూ ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అరటి పండును తీసుకొని దానిని ముక్కలుగా చేసుకుని, నల్ల మిరియాల పొడి ఇంకా లైట్ గా ఉప్పు చల్లుకుని తింటే చాలా మంచి ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.ఇంకా అలాగే చిలకడదుంపలను విరివిగా ఆహారంలో తీసుకుంటే మల బద్ధకం సమస్య నుంచి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇది జీర్ణక్రియకు సాయం చేస్తుంది.ఇంకా పెరుగు ఉబ్బరం ఇంకా మలబద్ధక సమస్యను కూడా ఈజీగా నివారిస్తుంది. అలాగే ఓట్స్ తో పాటు భోజనంలో కచ్చితంగా పెరుగుతో తినేలా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.ఇంకా ఫైబర్ చాలా ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు జీర్ణక్రియకు ఎంతగానో సాయం చేస్తాయి. కాబట్టి కచ్చితంగా ఫైబర్ ఉండే ఆహార పదార్థాలను మీ ఆహారంలో చేర్చుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: