నువ్వుల నూనెతో ఈ రోగాలన్నీ పరార్.. ఎలా అంటే..?

Divya

ప్రతి వంటింట్లో తప్పకుండా కనిపించే దినుసులలో నువ్వులు కూడా ఒకటి . నువ్వుల వల్ల మనకు ఎంతటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అంటే వీటిని మనం ప్రతిరోజు తీసుకోవడం వల్ల వైద్యుడు దగ్గరికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకే నువ్వులను అలాగే నువ్వుల నుంచి తీసిన నూనె ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.  ముఖ్యంగా సాంప్రదాయ ఆయుర్వేద పద్ధతులలో చికిత్స చేసే అనారోగ్య సమస్యలకి కూడా నువ్వుల నూనె తప్పకుండా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నువ్వుల నూనె వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

నువ్వులలో కార్బోహైడ్రేట్లు,  కొవ్వు పదార్థాలతో పాటు విటమిన్ A, C, E, B1, B2, B3, B6, B9 , కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్ , ఐరన్, సోడియం, మెగ్నీషియం మొదలైన పోషకాలు మెండుగా లభిస్తాయి. నువ్వుల నూనెలో క్యాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు బలంగా మారడానికి సహాయపడుతుంది. నువ్వుల నూనెలో కాపర్,  జింక్,  మెగ్నీషియం కూడా ఉంటాయి. మోకాలు, కీళ్ల దగ్గర ఈ నూనె వేసి అప్లై చేసి మసాజ్ చేస్తే వయసుతో పాటు ఎముకల్లో వచ్చే బలహీనతను కూడా తొలగిస్తుంది.
నువ్వులను వాడటం వలన చర్మానికి తేమ లభిస్తుంది. మృదువుగా మారి ముడతలు నియంత్రించబడతాయి. ఈ నూనె అనేక చర్మ సమస్యలను తగ్గించి సహజ సన్ స్క్రీన్ గా  కూడా ఉపయోగపడుతుంది. చర్మం ఈ నూనెను త్వరగా పీల్చుచుకుంటుంది. దానికి పోషణ ఇచ్చి ఎండిపోవటం మరియు పగుళ్లను పోయెటట్లు చేస్తుంది.
నువ్వుల నూనె నోటి ఆరోగ్యానికి, పరిశుభ్రతకి చాలా బాగా ఉపయోగపడుతుంది . నోటిలో నువ్వుల నూనెను పోసుకుని పుక్కలించడం వలన నోటి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది.పళ్ళు పుచ్చిపోవటాన్ని నయం చేయటంతో పాటు ఇతర లాభాలు కూడా ఉన్నాయి.
గుండె సమస్యలతో బాధపడుతున్న వారికి నువ్వులు చాలా బాగా ఉపయోగపడతాయి. నువ్వులలో యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా  ఉండడం వలన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మెరుగైన రక్తప్రసరణను ప్రోత్సహిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: