కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఏం చెయ్యాలి?

Purushottham Vinay
కిడ్నీలు శుభ్రంగా ఉంచుకోవాలి. లేకుంటే ఖచ్చితంగా కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కిడ్నీ జబ్బులు రాకుండా వుండాలంటే ముందుగా 2 టీ స్పూన్ల పుచ్చగింజలను తీసుకుని వాటిని బాగా పొడిగా చేసుకోవాలి.ఆ తరువాత ఒక గిన్నెలో 2 గ్లాసుల నీళ్లు పోసి వాటిని బాగా వేడి చేయాలి. నీళ్లు కొద్దిగా వేడయ్యాక అందులో పుచ్చగింజల పొడిని వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి.తరువాత ఈ నీటిని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకుని రోజుకు రెండు లేదా మూడుసార్లు తాగాలి. ఇలా తాగడం వల్ల మూత్రపిండాల్లో పేరుకుపోయిన మలినాలన్ని చాలా ఈజీగా తొలగిపోతాయి. ఈ టీని తాగడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఇక మూత్రపిండాలను శుభ్రపరిచే మరో టిప్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కిడ్నీలను శుభ్రపరచడంలో మొక్కజొన్న పొత్తులో ఉండే పీచు ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం సాధారణంగా పొత్తులు తీసుకొని పీచును మాత్రం పడేస్తూ ఉంటాం. కానీ ఈ మొక్కజొన్న పీచుతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల  సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.


ఈ పీచుతో టీని తయారు చేసుకుని తాగడం వల్ల కిడ్నీలు బాగా శుభ్రపడతాయి.కిడ్నీల్లో రాళ్ల సమస్య నుండి ఈజీగా ఉపశమనాన్ని పొందవచ్చు.ఇంకా అలాగే గుండె జబ్బులు, డయాబెటిస్, రక్తపోటు వంటి సమస్యలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. అందుకోసం మనం ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసి వేడి చేయాలి. ఆ నీళ్లు కొంచెం వేడయ్యాక గుప్పెడు మొక్కజొన్న పీచును వేసి నీళ్లు రంగు మారే వరకు మరిగించాలి. తరువాత ఈ నీళ్ళని వడకట్టి ఒక బాటిల్ లోకి తీసుకోవాలి. ఈ నీళ్ళని రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవాలి. ఇలా తాగడం వల్ల మూత్రపిండాలు శుభ్రపడతాయి. వాటి ఆరోగ్యం బాగా మెరుగుపడి పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఈ టిప్స్ పాటించడం వల్ల మూత్రపిండాల్లో పేరుకుపోయిన మలినాలు చాలా ఈజీగా తొలగిపోతాయి. ఇంకా అంతేకాకుండా మన శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: