ఇది తాగితే ఎంత కొవ్వైనా కరగాల్సిందే?

Purushottham Vinay
అధిక బరువు అధిక కొవ్వు సమస్యతో బాధపడేవారికి కొన్ని ఇంటి చిట్కాలు చాలా బాగా ఉపయోగపడతాయి. అవి పాటిస్తే ఎలాంటి ఖర్చు లేకుండా చాలా ఈజీగా బరువు తగ్గుతారు.ఇక మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మన పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు అంతా కూడా చాలా సులభంగా కరిగిపోతుంది.ఇంకా ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి మనం కేవలం నిమ్మకాయలను మాత్రమే వాడాల్సి ఉంటుంది. ముందుగా ఒక 4 నిమ్మకాయలను తీసుకుని వాటిని బాగా శుభ్రంగా కడగాలి. ఆ తరువాత వీటిని రెండు భాగాలుగా చేసి వాటిలో ఉండే గింజలను తీసి వేయాలి. తరువాత వీటిని జార్ లో వేసి బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని గాజు సీసాలో వేసి ఫ్రిజ్ లో ఉంచి స్టోర్ చేసుకుంటే అది 15 రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇక ఇలా తయారు చేసిన నిమ్మకాయ పేస్ట్ ను ఒక టీ స్పూన్  తీసుకుని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసి బాగా కలపాలి.ఈ పానీయాన్ని నేరుగా  తాగవచ్చు. అయితే ఇది చేదుగా ఉంటుంది.అయితే తాగలేని వారు దీనిలో ఒక టీ స్పూన్ తేనెను కలిపి తీసుకోవచ్చు.


అయితే షుగర్ వ్యాధి గ్రస్తులు తేనెను కలిపి తీసుకోకపోవడమే చాలా మంచిది. ఇలా తయారు చేసుకున్న డ్రింక్ ని రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఇలా తాగడం వల్ల పొట్ట మొత్తం కూడా శుభ్రపడుతుంది. ఇంకా అలాగే శరీరంలో ఉన్న మలినాలు, వ్యర్థ పదార్థాలు అన్నీ కూడా ఈజీగా తొలగిపోతాయి. ఈ పానీయం పుల్లగా ఇంకా చేదుగా ఉన్నప్పటికి బరువు తగ్గించడంలో చాలా అద్భుతంగా పని చేస్తుంది.  కేవలం నిమ్మరసంలోనే కాకుండా నిమ్మతొక్కలో కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. వీటిలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు బరువు తగ్గేలా చేయడంలో చాలా చక్కగా పని చేస్తాయి. ఇంకా ఈ సమ్మేళనాలు చాలా శక్తివంతమైనవి కూడా. 6 గ్రాముల నిమ్మకాయ తొక్కలో 3 గ్రాముల క్యాలరీలు, ఒక గ్రాము కార్బోహైడ్రేట్స్, ఒక గ్రాము ఫైబర్ ఇంకా అలాగే 9 శాతం విటమిన్ సి అనేవి ఉంటాయి.ఇంకా అలాగే వీటిలో క్యాల్షియం, పొటాషియం ఇంకా మెగ్నీషియం కూడా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: