ఉన్నట్టుండి జుట్టు రాలుతోందా..దానికి కారణమేంటో తెలుసా..?

Divya
కొంతమందిలో జుట్టు అకస్మాత్తుగా ఊడిపోతు ఉంటుంది.ఇప్పుడున్న పొల్యూషన్, ఆహార అలవాట్లు
లాంటి కారణాలు కూడా జుట్టు రాలడానికి దారితీస్తాయి.అంతేకాక కొన్ని మనకు తెలియకుండానే చిన్న చిన్న కారణాలు కూడా జుట్టు ఉడేలా చేస్తాయి.
అవేంటో ఇప్పుడు చూద్దాం..!
1.జుట్టు పల్చగా ఉన్నవారిలో జుట్టు రాలడం ఎక్కువగా కనిపిస్తుంది.పెరుగుదల తక్కువ ఉండి సిల్కీ హెయిర్ ఉన్నవారికి కూడా జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటుంది.దీనికి కారణం శరీరంలో ఆండ్రోజెన్ హార్మోన్ ఊత్పత్తి పెరిగినప్పుడు కూడా జుట్టు రాలడం, పల్చగా మారడం వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
2. వంశపార్యం పర్యంగా వచ్చే జన్యుపరమైన లోపాలు  వల్ల కూడా జుట్టు రాలడం , బట్టతల రావడం వంటి సమస్యలు వస్తాయి.ఇటువంటి వారికి వైద్యున్ని సలహా మేరకు మందులు వాడటమే మంచిది.
3.అధికంగా స్త్రీలలో  జుట్టు రాలడానికి ముఖ్యమైన కారణం ఐరన్ లోపించడం. ఋతుక్రమం సక్రమంగా రాకపోవడం, అధిక రక్తస్రావం వల్ల రక్తహీనత ఏర్పడటం, హర్మోనల్ ఇంబ్యాలెన్స్ వంటివి ఇందుకు కారణాలని చెప్పవచ్చు.
4.అధిక ఒత్తిడివల్ల కూడా జుట్టు అధికంగా రాలుతుంది. అధిక ఒత్తిడి కారణంగా శరీరంలో కార్టికోస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది వెంట్రుకల ఊత్పత్తి కణాలను క్రియారహితంగా మారుస్తుంది. అందువల్ల జుట్టు కణవిభజన సరిగా జరగక జుట్టు పెరుగుదల తగ్గి, జుట్టు రాలే సమస్య అధికమవడానికి ప్రేరేపిస్తుంది.
5.జుట్టు రాలడానికి వయసు కూడా ఒక సమస్యే. ఏజ్ పెరిగేకొద్దీ మహిళలో మెనోపాజ్ వస్తుంది. ఆ తర్వాత, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల ఊత్పత్తి తగ్గుతుంది. దాని కారణంగా జుట్టు రాలడం గణనీయంగా పెరుగుతుంది. ఈ రెండు హార్మోన్లు ప్రధానంగా జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయి.
జుట్టురాలే సమస్య తగ్గించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు..
 జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి ముఖ్యంగా జీవన విధానం ఆహార శైలి మార్చుకోవాలి.జంక్ ఫుడ్ కి, గ్యాడ్జెట్స్ కీ దూరంగా ఉండాలి. జుట్టును బాగా శుభ్రం చేస్తూ, కండిషనింగ్ చేస్తూ ఉంటే, జుట్టు పెరుగుదల చాలా బాగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: