వంట నూనె బదులుగా ఎలాంటి నూనెలు ఆరోగ్యానికి మేలు చేస్తాయో తెలుసా..!

Divya
ఈమధ్య కాలంలో డైట్ పేరు చెప్పి వంటల్లో నూనె వాడడం మానేస్తున్నారు. కారణం అధిక బరువు,చెడు కొవ్వు పేరుకుపోవడం, దీనితో గుండె సంబంధిత సమస్యలు రావడం,అధిక బీపీ వంటి సమస్యలకు అధిక కొవ్వులు వున్న అయిల్స్ అని మానేస్తున్నారు.అయితే మరీ అయిల్ తినకుండా ఉంటే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆహారంలో కొంతమేర కొవ్వు పదార్థాలు తీసుకోవడం మంచిదని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

 సాధారణంగా కొవ్వులలో మంచి కొవ్వు,చెడు కొవ్వు అని రెండురకాలు ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ వల్ల  మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.రక్త ప్రసరణ సవ్యంగా జరిగేలా సహాయపడుతుంది. కావున ఈ కొవ్వులు మంచే చేస్తాయి కానీ, రోడ్ పక్కన దొరికే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల, ఇందులో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల శరీరం చాలా అనారోగ్య సమస్యలను ఎదురుకుంటుంది.
 మన శరీరానికి మంచికొవ్వులు చాలా అవసరము. కొవ్వు పదార్థాలు లేని వంటలు తినడం వల్ల కొంచెం పని చేసినా కూడా అలసట నిశ్శత్తువకు గురై శరీరం అనారోగ్యానికి పాలవుతుంది. శరీరానికి మంచి కొవ్వులు అందాలంటే, భారతీయ సాంప్రదాయ వంటలు, మన పద్ధతులు చేసుకుంటే చాలు. అయిల్ బదులుగా మంచి కొవ్వులున్న నెయ్యి వాడటం చాలా మంచిది.
ముఖ్యంగా చేపల నుంచి లభించే ఒమేగా3ఫ్యాటీ యాసిడ్స్  తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన మంచి కొవ్వు అందుతుంది.
వీటి ద్వారా జీర్ణశక్తి పెరగడమే కాకుండా శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. కొన్ని ప్రాంతాలలో కొబ్బరి నూనెలు వంటల్లో వాడుతుంటారు.దీని ద్వారా  శరీరంలోని కొవ్వు స్థాయిని కంట్రోల్ చేస్తుంది ప్రతిరోజు ఒక స్పూన్ కొబ్బరి నూనె తీసుకోవడం ద్వారా అధిక బరువు వున్నవారు కూడా తగ్గవచ్చు
ఆలీవ్ నూనెను కూడా వంటల్లో వాడుకోవచ్చు.ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిని వంటల్లో వాడుకోవచ్చు కానీ డీప్ ఫ్రై చేయడానికి మాత్రం వాడకూడదు. నువ్వులనూనె వాడటం వల్ల, ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీనిని రోజుకు మితంగానే తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: