రోజు స్నానం చెయ్యట్లేదా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు?

Purushottham Vinay
రోజు స్నానం చెయ్యట్లేదా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు?

స్నానం చేయడం వల్ల చర్మానికి ఉపశమనం కలుగుతుంది. స్నానం మానేస్తే.. చర్మవ్యాధులు, సీజనల్ వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి. ఒక్కోసారి ఇది తీవ్రమైన చర్మ వ్యాధులకు దారి తీస్తుంది.శీతాకాలం, వర్షాకాలంలో హెయిర్ లాస్ ఎక్కువగానే ఉంటుంది. వారానికి కనీసం ఒకసారి నుంచి రెండు సార్లు తలస్నానం కూడా చేయాలి. లేదంటే జట్టు ఎక్కువుగా ఊడిపోతుంది. స్కాల్ప్పై దురద వంటి సమస్యలు వస్తాయి. ఇవి హెయిర్ లాస్సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.స్నానం చేయకపోవడం వలన శరీరంలో ఉండే వైరస్, బ్యాక్టీరియా ఎక్కువుగా వృద్ధి చెందుతాయి. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని మరింత తగ్గించి ఇన్ఫెక్షన్లకు గురి చేస్తాయి.స్నానం చేయకుండా బద్ధకించడం వల్ల బాక్టీరియా శరీరం అంతటా వ్యాప్తి చెంది, దుర్వాసనను పెంచుతుంది. ఇది అసహ్యకరమైన వాసనతో పాటు.. వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది.శీతాకాలంలో స్నానం చేయకపోతే మృతకణాలు ఉత్పత్తి అవుతాయి. ముఖ్యంగా గజ్జ ప్రాంతంలో. 


ఈ మృతకణాలు ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. ఇవి శరీరంలోని ఇతర భాగాలకు మరింత వ్యాప్తి చెందుతాయి. స్నానం మానేయడం వల్ల శరీరంలోని వివిధ భాగాలలో మృతకణాలు బాగా పేరుకుపోయి.. ఇన్ఫెక్షన్లకు దారి తీస్తాయి.సీజనల్ వ్యాధులు త్వరగా వస్తాయని హెచ్చరిస్తున్నారు. వైద్య నిపుణులు. శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. పైగా బద్ధకంగా అనిపిస్తుంది. ఈ సమయంలో ఏపని చేయడానికైనా కాస్త బద్ధకించడం సాధారణం. బద్ధకం వల్ల స్నానం చేయాలని అనిపించదు. స్నానం చేయకపోవడం వల్ల అనేక హానికరమై ప్రభావాలు వస్తాయంటున్నారు నిపుణులు. స్నానం చేయకపోవడం వల్ల కొన్ని రకాల సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు. సాధారణంగా మన ఇంటిని రోజూ ఊడ్చుకోకపోతే.. ఎలా దుర్వాసన వచ్చి, చికాకుగా అనిపిస్తుందో.. మనం స్నానం చేయకపోతే అంతే దుర్వాసన రావడంతో పాటు ఎలర్జీ వచ్చే అవకాశం ఎక్కువుగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: