పుచ్చి పళ్ళ సమస్యను తగ్గించే ఈజీ టిప్?

Purushottham Vinay
మన పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి. దానికి చాలా కారణాలు వున్నాయి. ఆ కారణాలు ఏంటో తెలుసుకొని ఆ సమస్యని తగ్గించుకునే పరిష్కారం తెలుసుకుందాం.ఎక్కువ కాలం టూత్ బ్రష్‌ను వాడినా అది దంత క్షయానికి కారణమవుతుంది. కనుక టూత్ బ్రష్‌ను కనీసం 6 నెలలకు ఒకసారి మార్చాల్సి ఉంటుంది. అలాగే మీ నోటికి సరిపోయే విధంగా ఉండే చిన్న లేదా మీడియం సైజ్ టూత్ బ్రష్‌లను వాడాలి. వాటి బ్రిజిల్స్ సాప్ట్‌గా ఉండాలి. దీంతో దంతాల మధ్య ఉన్న ఆహారం సులభంగా పోతుంది. టూత్ బ్రష్ బ్రిజిల్స్‌కు క్యాప్‌లు పెట్టరాదు. పెడితే బ్రిజిల్స్ లో బాక్టీరియా పెరుగుతుంది. అది దంత క్షయాన్ని కలిగిస్తుంది. టాయిలెట్‌కు వీలైనంత దూరంగా టూత్ బ్రష్‌ను ఉంచాలి. లేదంటే టాయిలెట్ నుంచి వచ్చే బాక్టీరియా నేరుగా బ్రష్‌పైనే పేరుకుపోతుంది. అది దంత క్షయాన్ని కలిగిస్తుంది.రోజుకు రెండు కనీసం 2 నిమిషాల పాటు అయినా బ్రషింగ్ చేయాలి. దంత నలుమూలలను శుభ్రం చేయాలి. లోపల, బయట క్లీన్ చేయాలి. ఫ్లాసింగ్ తప్పనిసరిగా చేయాలి. ఇది దంతాల సందుల్లో ఇరుక్కున్న ఆహార పదార్థాలను తొలగిస్తుంది. మౌత్ వాష్ వాడాలి. ఇది యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. నోట్లో ఉండే బాక్టీరియాను తొలగిస్తుంది. దంత సమస్యలు ఉన్నా లేకున్నా సరే డెంటిస్ట్‌లను తరచూ కలిసి సలహాలు తీసుకోవాలి. అవసరం ఉన్న మేర మందులను వాడాలి. అవసరం అనుకుంటే చికిత్స తీసుకోవాలి. దీంతో తరువాతి కాలంలో దంత సమస్యలు రాకుండా ఉంటాయి.

డెంటిస్ట్‌లతో నోటిని శుభ్రం చేయించుకోవాలి. దీంతో దంత క్షయం వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. కనీసం ఏడాదిలో రెండు సార్లు అయినా డెంటిస్ట్‌లను కలిస్తే మంచిది.విటమిన్లు, మినరల్స్ ఉన్న ఆహారాన్ని రోజూ తీసుకోవాలి. పీచు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను తినాలి. యాపిల్స్‌, అరటిపండ్లు, మొలకెత్తిన గింజలు తినాలి. తృణధాన్యాలు, విటమిన్ బి, ఐరన్ ఉండే ఆహారం తీసుకోవాలి. మెగ్నిషయం, విటమిన్ డి ఉండే ఆహారాలను సైతం క్రమం తప్పకుండా తీసుకుంటే దంత క్షయం రాకుండా చూసుకోవచ్చు. రోజూ ఉదయాన్నే ఒక టేబుల్ స్పూన్ మోతాదులో కొబ్బరి నూనె తీసుకుని దాన్ని నోట్లో పోసుకుని 20 నిమిషాల పాటు ఆయిల్ పుల్లింగ్ చేయాలి. ఆయిల్‌ను నోట్లో అలాగే ఉంచాలి. దీంతో నోట్లో ఉమ్మి, ఆయిల్ కలిసి పాల వలె తెల్లగా మారుతాయి. అయితే ఈ మిశ్రమాన్ని మింగరాదు. ఉమ్మేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల దంత సమస్యలు పోతాయి. దంత క్షయం ఉండదు.చక్కెర లేని షుగర్ లెస్ చూయింగ్ గమ్‌లను నమిలితే దంత క్షయం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. షుగర్ లెస్ చూయింగ్ గమ్‌లలో జైలిటాల్ అనబడే పదార్థం ఉంటుంది. ఇది సహజ సిద్ధ స్వీటెనర్‌. ఇది నోట్లో బాక్టీరియాను పెరగనీయకుండా చేస్తుంది. దీంతోపాటు ఉమ్మి ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చూస్తుంది. దీంతో దంత క్షయం రాకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: