ఇవి తింటే నోటి దుర్వాసన అస్సలు రాదు?

Purushottham Vinay
నోటి దుర్వాసన ఎంత ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఇతరులను చాలా ఇబ్బంది పెడుతుంది. నోటి దుర్వాసన స్మోకింగ్ వల్ల  వస్తుంది.ఇంకా అలాగే పళ్లు శుభ్రంగా తోముకోకపోయినా, ఏదైనా తిన్న తర్వాత నోటిని శుభ్రం చేసుకోకపోవడం వల్ల నోటి దుర్వాసన సమస్య ఎదురవుతుంది. నోటి దుర్వాసనతో చాలా మంది బాధపడుతుంటారు. ఈ సమస్య వల్ల మనలో మనం కుమిలిపోతూ ఉంటాం.. నోటి దుర్వాసన వల్ల మన పక్కవారూ ఇబ్బంది పడుతుంటారు. సాధారణంగా పరిశుభ్రంగా ఉండకపోవడం.. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో నోటి దుర్వాసన వస్తుంది. దీర్ఘకాల నోటి వ్యాధుల వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. వెల్లులి, ఉల్లిపాయలు వంటి ఆహారాల్లో ఉండే దుర్వాసన గల నూనెలు.. ఊపిరితిత్తులకు చేరినప్పుడు నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో నోటి దుర్వాసన కలిగించకుండా ఉండే ఆహారాలు ఉన్నాయి. ఈ ఆహార పదార్థాలు నోటి దుర్వాసనతో పోరాడతాయి.అల్లంలో ఉండే 6-జింజెరాల్ నోటిలోని సల్ఫర్ సమ్మేళనాల విచ్ఛినానికి సహాయపడే లాలాజల ఎంజైమ్ ను ఇస్తుంది.


అల్లం లేదా అల్లం ఉపయోగించిన పదార్థాలను తీసుకుని నోటి దుర్వాసనను కంట్రోల్ చెసుకోవచ్చు.తులసిలోని పాలీఫెనాల్స్ అనే సహజ అణువులు నోటి దుర్వాసనకు చికిత్స అందించడంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి. తులసిని ఏ విధంగా తీసుకున్నా.. నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.పెరుగులో ఫ్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి చెడు దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను అధిగమిస్తుంది. వీటిలో విటమిన్ డి కూడా పుష్కలంగా ఉండటంతో శరీరంలో క్రిములు పెరగడాన్ని తగ్గిస్తుంది.నిమ్మ, దానిమ్మ, యాపిల్, బత్తాయి, నారింజ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది బ్యాక్టిరియాను కంట్రోల్ చేయడానికి మాత్రమే కాకుండా.. చిగుళ్ల వ్యాధులు, చిగురువాపుతో పోరాడటానికి సహాయపడుతుంది.గ్రీన్ టీలో కాటెచిన్ అనే ఎనర్జిటిక్ యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది నోటి దుర్వాసన కలిగించే సల్ఫర్ సమ్మేళనాలను తగ్గించడం ద్వారా బ్యాక్టిరియాను నిరోధిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: