గుమ్మడి గింజల వల్ల ఎన్ని ప్రయోజనాలు తెలుసా..?

Divya
గుమ్మడికాయ గింజలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుచేతనే గుమ్మడికాయ వంటలలో బాగా ఎక్కువ మంది ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా దీని ద్వారా స్వీట్ల తయారీ కూడా చేస్తూ ఉంటారు.కానీ చాలామందికి గుమ్మడికాయ విత్తనాల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలియక పారేస్తూ ఉంటారు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గుమ్మడికాయ గింజలలో పోలేట్ ,బీటా కెరటిన్, ఐరన్ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ ఇమ్యూనిటీ పరంగా పవర్ ను పెంచేలా చేస్తూ ఉంటాయి.ఇందులో కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతూ ఉంటాయి. దీంతో పొటాషియం రక్తపోటు నియంత్రణను అదుపులో ఉంచుతుంది దీంతో పక్షవాతం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా గుమ్మడికాయ గింజలలో ఉండే విటమిన్లు కళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించేలా చేస్తూ ఉంటుంది. విటమిన్లు పలు రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించేలా చేస్తాయని నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గుండె ఊపిరితిత్తులు కిడ్నీలు వంటి వాటిని ఆరోగ్యంగా ఉంచేందుకు చాలా సహాయపడతాయి.

పనిలో ఒత్తిడి తగ్గుదల ఆర్థిక సమస్యలు ఇలా ఎన్నో రకాల ఒత్తిడికి గురవుతున్న వారు ప్రతి రోజు కూడా వీటిని తిన్నట్లు అయితే ఆ ఎఫెక్ట్ నుంచి బయటపడవచ్చు. ఇందులో ఉండే విటమిన్స్ జింక్ కూడా టెన్షన్ తగ్గించాలా చేస్తూ ఉంటాయి. నిద్ర మన శరీరానికి చాలా అవసరము. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు ఇది ఒక మెడిసిన్ లా కూడా ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. వీటిని రాత్రి సమయాలలో పడుకునే ముందు తిన్నట్లు అయితే హాయిగా నిద్రపోతారట. ఇక గుమ్మడి గింజలు షుగర్ పేషెంట్లకు కూడా మంచి ఔషధంలా పనిచేస్తాయి.ఇందులో పీచు పదార్థాలు పుష్కలంగా ఉండడం వల్ల మధుమేహం వల్ల కలిగే పలు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.ఇందులో పలు రకాల ఔషధాల వల్ల రోగ నిరోధక శక్తి పెంచేలా చేస్తాయి గుమ్మడి గింజలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: