బరువు తగ్గేందుకు ఈజీ మార్గాలు?

Purushottham Vinay
బరువు తగ్గేందుకు ప్రయత్నించే వారిలో చాలామందికి కూడా ఆహారం విషయంలో కొన్ని డౌట్స్ ఉంటాయి. ఏం తినాలి? ఏం తినకూడదు అనే విషయంలో గందరగోళానికి గురువుతున్నారు. బరువు తగ్గడానికి తేలికైన ఆహారం తీసుకోవడం చాలాముఖ్యం. అలాగే తక్కువ కేలరీలు, వ్యాయామం, సరైన నిద్ర పోవడం కూడా ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటే, మీ ఆహారంలో నెయ్యి తీసుకోకూడదని చాలా మంది చెప్పడం మీరు వినే ఉంటారు. నెయ్యిలో కొవ్వు ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలని ప్రయత్నించినప్పుడు చాలా మంది నెయ్యికి దూరంగా ఉంటారు. అయితే బరువు తగ్గాలంటే నెయ్యి వదులుకోవడం ఇంకా అలాగే బరువు తగ్గాలనుకునే చాలా మంది కార్బోహైడ్రేట్ తీసుకోవడం తగ్గించడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా అన్నం తినరు. మరి ఇవన్నీ నిజమేనా? నెయ్యి, అన్నంతో బరువు పెరుగుతామా?లేదా? అనే డౌట్స్ ఇప్పుడు తెలుసుకుందాం .బరువు తగ్గే సమయంలో నెయ్యిని వదులుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఇది బరువు తగ్గడానికి సరైన ఆహారం. ముఖ్యంగా జీర్ణక్రియకు బాగా తోడ్పడుతుంది. నెయ్యి మన శరీరానికి అవసరమైన కొవ్వు.


కాబట్టి బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆవు నెయ్యి అయితే మరీ మంచిదంటున్నారు నిపుణులు.బరువు తగ్గాలంటే అన్నం వదులుకోవాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఎంత మేర రైస్‌ తీసుకున్నారు? అందులో ఏ మేర పోషకాలు ఉన్నాయన్నది చాలా ముఖ్యం. బియ్యంలో మంచి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తాయి.సన్నబడటానికి ఎక్కువ వ్యాయామం చేయవలసిన అవసరం లేదు. త్వరగా బరువు తగ్గడానికి చాలా వ్యాయామాలు చేస్తే, బరువు తగ్గడం కంటే అలసట పెరుగుతుంది. బరువు తగ్గడంపై మాత్రమే దృష్టి పెట్టవద్దు. బరువు తగ్గడానికి నిద్రను త్యాగం చేయవద్దు. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం.పెరుగు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే రోజూ పెరుగు తీసుకోవడం వల్ల బరువు పెరుగుతుంది. ఎందుకంటే జీర్ణం కావడం చాలా కష్టం. పెరుగు లక్షణాలు కఫ దోషాన్ని పెంచుతాయి. ఇది బరువు పెరుగుటకు దారితీస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: