గుమ్మడికాయ ఆరోగ్యానికి ఇంత మంచిదా?

Purushottham Vinay
గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని కొందరు కూరగా చేసుకుని తింటారు. కొందరు వీటితో స్వీట్స్‌, వడియాలు కూడా చేసుకుంటారు. గుమ్మడికాయ వంటకాలు నచ్చినా, నచ్చకపోయినా,..గుమ్మడిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, వీటిల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా నిత్యం మనకు కావల్సిన విటమిన్ ఎ గుమ్మడికాయల్లో 200 శాతం ఉంటుంది. అలాగే విటమిన్ సి, ఇ, రైబోఫ్లేవిన్, పొటాషియం, కాపర్, మాంగనీస్, విటమిన్ బి6, ఫోలేట్‌, ఐరన్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు కూడా గుమ్మడికాయల్లో పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మనకు పోషణ లభిస్తుంది. గుమ్మడికాయలో ఉండే విటమిన్ సి..తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. రోగనిరోధక కణాలను మరింత సమర్థవంతంగా పని చేసేలా చేస్తుంది. ఫలితంగా రకరకాల వైరస్‌లూ, ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి.గుమ్మడికాయలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది చెడు LDL కొలెస్ట్రాల్‌ను ఆక్సీకరణం నుండి రక్షిస్తుంది. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ కణాలు ఆక్సీకరణం చెందినప్పుడు,.. అవి రక్త నాళాల గోడలకు అంటుకుని గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. గుమ్మడికాయలో చర్మానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడికాయలో ఉండే, విటమిన్ సి ఆరోగ్యకరమైన చర్మానికి అవసరం.


చర్మాన్ని బలంగా ఆరోగ్యంగా ఉంచే కొల్లాజెన్ అనే ప్రొటీన్‌ను తయారు చేయడానికి శరీరానికి ఈ విటమిన్ అవసరం. అంతేకాదు, గుమ్మడి గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.గుమ్మడికాయలో కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే కాంపౌండ్స్ అధికంగా ఉంటాయి. ఇది కొన్ని క్యాన్సర్ల నుండి రక్షిస్తుంది. గుమ్మడికాయలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే వివిధ పోషకాలు ఉన్నాయి. ఇందులో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటాయి, ఇది గుండె ప్రయోజనాలతో ముడిపడి ఉంది. దీనిలో ఉండే విటమిన్ ఎ శరీరంలో బీటాకెరొటిన్‌గా మారి హార్మోన్ల అసమతుల్యత రాకుండా కాపాడుతుంది. ఎముక సాంద్రత దృఢపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, బీటాకెరొటిన్లు అధికంగాఉంటాయి. ఇవి కంటిచూపు స్పష్టంగా ఉండటానికి దోహదం చెస్తాయి. కంటి సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: