ఎక్కిళ్ళు ఈజీగా తగ్గే సింపుల్ టిప్స్?

Purushottham Vinay
మనం తింటున్నప్పుడు కానీ వేరే సందర్భాలలో కానీ ఎక్కిళ్ళు అనేవి వస్తుంటాయి. ఇవి ఒక్కోసారి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కొన్ని సార్లు నీళ్లు తాగితే ఈ ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.కొన్నిసార్లు నీళ్లు తాగినా కూడా ఎక్కిళ్ళు అనేవి తగ్గకుండా చాలా ఎక్కువ సేపు ఇబ్బంది పెట్టవచ్చు. మన శరీరంలో ఉండే పక్కటెముకలు, డయాఫ్రాగమ్‌ల మధ్య ఎక్కిళ్లు సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు . వీటిలో ఉండే ఇంటర్‌కాస్టల్ కండరాలు అకస్మాత్తుగా సంకోచించం స్పామ్ రూపంలో ఉంటుంది. ఈ దుస్సంకోచం అకస్మాత్తుగా గొంతును తాకుతుంది అప్పుడు ఎక్కిళ్ళు మొదలవుతాయి.అయితే ఎక్కువ సేపు ఎక్కిళ్లు రావడంతో తరచూ ఇబ్బంది పడుతున్నారా? చక్కటి పరిష్కారం ఆయుర్వేదంలో చెప్పబడింది. ఇక ఈరోజు ఎక్కిళ్ల నుంచి ఉపశమనం ఇచ్చే ఆయుర్వేద టిప్స్ గురించి మనం తెలుసుకుందాం.ఎక్కిళ్ళ నుండి ఉపశమనం పొందాలనుకుంటే, దీని కోసం మీరు నల్ల మిరియాలు మంచి రెమిడీ. నల్ల మిరియాలను తినవలసిన అవసరం లేదు.. వాసన చూడండి. 


దీని కోసం కాటన్ క్లాత్ తీసుకుని దానిలో నల్ల మిరియాల పొడి వేసి.. గుడ్డను టై చేసి.. అప్పుడు వాసన చూడండి. ఈ పధ్ధతి మీకు నిమిషాల్లో ఎక్కిళ్ళనుంచి ఉపశమనం ఇస్తుంది.ఎక్కిళ్ళు వదిలించుకోవటంలో చక్కెర కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ రెసిపీ చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఒకటి లేదా అర టీస్పూన్ పంచదార తీసుకుని నోటిలో వేసుకుని నమలాలి. చక్కెర రసం చిటికెలో ఎక్కిళ్లను తొలగిస్తుంది.ఎక్కిళ్లు వచ్చినప్పుడు ఎక్కువ మంది నిమ్మరసం, లేదా నీరు త్రాగడం వంటి చిట్కాలను అనుసరిస్తారు. కొన్ని సార్లు అవి పని చేయవు. అప్పుడు యాలకుల పొడితో ఉపశమనం పొందవచ్చు. దీని కోసం నీటిని మరిగించి.. దానిలో కొద్దిగా యాలకుల పొడి వేయండి. ఆ నీటిని వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు సిప్-సిప్ తాగండి.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. ఎక్కిళ్ళు ఈజీగా తగ్గిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: