ఈ టేస్టీ పిండివంటతో సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం?

Purushottham Vinay
ఈ మధ్య కాలంలో అన్నీ వయస్సుల వారు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఎముకలకు సంబందించిన సమస్యలు ఇంకా రక్తహీనత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.అలాంటి వారు ఈ అప్పాలను తింటే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. వీటిని సజ్జ బూరెలు అని కూడా పిలుస్తారు.వీటిని తయారు చేసే విధానం ఇప్పుడు చూడండి.ఒక గిన్నెలో ఒక కప్పు సజ్జలను తీసుకొని శుభ్రంగా కడిగి నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి. నానిన సజ్జలలో నీటిని తీసేసి ఒక క్లాత్ మీద అరగంట పాటు ఆరబెట్టాలి. ఆరిన సజ్జలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని జల్లెడ సాయంతో జల్లించాలి. పొయ్యి మీద పాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేయాలి.నెయ్యి కరిగాక రెండు స్పూన్ల గసగసాలు వేసి ఒక సారి కలిపి అరకప్పు పచ్చి కొబ్బరి వేసి పచ్చి వాసన పోయే వరకు వేగించాలి. ఆ తర్వాత పాన్ లో అరకప్పు బెల్లం, చిటికెడు ఉప్పు వేసి మూడు స్పూన్ల నీటిని వేసి బెల్లం కరిగాక పొయ్యి ఆఫ్ చేయాలి. పాకం రావలసిన అవసరం లేదు.


బెల్లం నీటిని వడకట్టి పక్కన పెట్టాలి.ఒక బౌల్ లో సజ్జ పిండి, వెగించిన గసగసాలు,కొబ్బరి మిశ్రమం, అరస్పూన్ యాలకుల పొడి వేయాలి. ఆ తర్వాత బెల్లం నీటిని పోసి పిండిని ముద్దలా కలపాలి. ఈ పిండిని కొంచెం తీసుకొని ముద్దలా చేసుకొని అప్పంలా వత్తి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి దాదాపుగా 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి.వీటిని వారంలో 2 సార్లు తింటే రక్తహీనత మరియు ఎముకలకు సంబందించిన సమస్యలు అయిన కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు వంటివి తగ్గుతాయి. ముఖ్యంగా మహిళలు వీటిని తింటే మంచి ప్రయోజనాలను పొందవచ్చు. సజ్జ అప్పాలు చాలా రుచిగా ఉంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఆర్గానిక్ బెల్లం ఉపయోగిస్తే చాలా మంచిది.కాబట్టి ఖచ్చితంగా ఇవి చేసుకోని తినండి. కీళ్ళ నొప్పులు కాళ్ళు నొప్పులు మాత్రమే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా వుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: