నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి అద్భుతమైన చిట్కా..?

Divya
ఈ మధ్యకాలంలో వర్క్ ఫ్రం హోం పేరిట చాలామంది లాప్టాప్,  మొబైల్స్ లోనే ఎక్కువగా పనిచేస్తున్న నేపథ్యంలో వీటి నుంచి వెలువడే కిరణాలు నిద్రను పోగొడుతున్నాయని చెప్పవచ్చు.  ఇక ఎంత ఒత్తిడికి గురైనా సరే నిద్ర పట్టడం లేక చాలామంది మరుసటి రోజు మరింత ఇబ్బందికి గురి అవుతున్నారు. నిద్రలేమి సమస్య అనేది కేవలం మగవారికి మాత్రమే కాదు ఆడవారిలో కూడా ఎక్కువగా కలవరపెడుతోంది. చిన్న సమస్య అయినప్పటికీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి సమస్య వల్ల గుండె జబ్బులు, మెదడు పనితీరు తగ్గిపోవడం, జీర్ణ వ్యవస్థ దెబ్బ తినడం, అధిక బరువు లాంటి ఎన్నో సమస్యలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
అందుకే నిద్రలేమిని వదిలించుకోవడం కోసం నానా తిప్పలు పడుతూ ఉంటారు. ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే ఒక పొడిని మీరు పాలలో కలుపుకొని రోజు తాగినట్లయితే నిద్రలేమి సమస్యను సులభంగా తరిమికొట్టవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసి దానిపైన పాన్ పెట్టి అందులో కొన్ని బాదం పప్పులు, గుప్పెడు పల్లీలు, మూడు టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలు, మూడు టేబుల్ స్పూన్ల సన్ ఫ్లవర్ సీడ్స్, రెండు టేబుల్ స్పూన్ల సోయాబీన్స్,  గుప్పెడు వాల్నట్స్ ఒకదాని తర్వాత మరొకటి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పదార్థాలను పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేయాలి. ఇక ఈ పొడిని నిల్వ ఉంచుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా సరే వాడుకోవచ్చు. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో ఒక టేబుల్ స్పూన్ ఈ పౌడర్ ను వేసుకొని కొద్దిగా బెల్లం తురుము కూడా కలిపి ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి ముందు నిద్ర పోయేముందు తీసుకున్నట్లయితే మంచి నిద్ర వస్తుంది. ఇక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మీ  మెదడు కూడా చురుకుగా పని చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: