కలాకండ్ తో లాభాలెన్నో.. ఎప్పుడైనా తిన్నారా..?

Divya
దీనిని పటిక బెల్లం అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ప్రాంతాన్ని బట్టి ఒకరు ఒక్కోరకంగా పిలిచే పటిక బెల్లం లో ఎన్నో రకాల ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇళ్ళ ల్లో  కూడా విరివిగా లభించే ఈ పటిక బెల్లం లో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయని బహుశా చాలామందికి తెలియదు.ఆయుర్వేద వైద్యంలో కూడా దీనిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో కూడా ఈ పటిక బెల్లం సహాయపడుతుంది. ముఖ్యంగా పటిక బెల్లంతో తయారు చేసిన నీళ్లు తాగడం వల్ల మరింత ప్రయోజనాలు చేకూరుతాయాట.

యోని సమస్యలతో మహిళలు ఇబ్బంది పడుతున్నట్లయితే పటిక నీరు తాగడం చాలా మంచిది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే రక్తస్రావాన్ని ఆపడంలో ఇది సహాయపడుతుంది. పటిక బెల్లం నానబెట్టిన నీటితో యోనిని శుభ్రం చేస్తే వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్ల సమస్య తగ్గిపోవడమే కాకుండా శరీరంలో వచ్చే తిమ్మిర్లు,  వాపులు కూడా తగ్గిపోతాయి.  యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల శరీరం వాపుకి గురికాకుండా ఉంటుంది. ఇక పటిక నీరు పంటి నొప్పులను తగ్గించడంలో కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. ఇక ఎరుపు రంగు పటిక ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందట. క్రమం తప్పకుండా పటిక బెల్లంతో పళ్ళు తోముకుంటే మిల మిల మెరుస్తాయి..
ఇక పటిక నీటిని నోట్లో వేసుకొని పుక్కలిస్తూ ఉంటే పేరుకుపోయిన ఫలకం తొలగిపోతుంది. అలాగే మౌత్ వాష్ లా పని చేస్తుంది. నోటి నుంచి వచ్చే దుర్వాసన,  పొడి దగ్గు,  ఆస్తమా,  మలేరియా,  థైరాయిడ్ వంటి సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఇకపోతే పటిక నీటిని తయారు చేయడానికి ఒక పాన్ పెట్టి అందులో పటికను వేడి చేయాలి. ఇలా చేస్తే పటిక శుద్ధి అవుతుంది. ఆ తర్వాత కొంచెం కరిగే వరకు నీళ్లు పోసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు వాడవచ్చు. ఇక ఇన్ని ప్రయోజనాలను పటికను తప్పకుండా ఉపయోగించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: