మన ఆహార పదార్ధాలు కల్తీవో కావో ఇలా తెలుసుకోవచ్చు!

Purushottham Vinay
ఇక ప్రస్తుత కాలంలో.. కల్తీ లేకుండా ఎలాంటి ఆహారాలు లభించడం లేదనండంలో అసలు ఎలాంటి సందేహం లేదు. పాల నుంచి మొదలు పెడితే.. పప్పులు, ఉప్పులు, నూనెలు ఇంకా బియ్యం అంటూ వంటింటింట్లో వాడే ప్రతీదీ కల్తీ అవుతూనే ఉంది. ఇక ఇలాంటి వాటిని గుర్తించకుండా ఉపయోగిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం బయట కొంటున్న ఆహార పదార్థాలు అనేవి కల్తీవో కావో ఇలా తెలుసుకోవచ్చు.కారం..  ఇక మనం షాపుల్లో కొనే కారం పొడి అనేది కల్తీ అయ్యిందో కాలేదో అని కనుక్కోవాలంటే.. టీ స్పూన్ కారం పొడిని తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేయండి. అందులో కొంత కారం పొడైనా గ్లాస్ అడుగుభాగానికి చేరుకుంటే అది ఇటుక పొడి అని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం చాలా మంది కూడా కారం పొడిలో ఇటుక పొడిని కలుపుతున్నారు.మిరియాలు ఇంకా బొప్పాయి గింజలు చూడటానికి కొంచెం అటు ఇటుగా ఒకేలా కనిపిస్తాయి. అందుకే చాలా మంది వీటిని కూడా కల్తీ చేస్తున్నారు. బొప్పాయి గింజలను మిరియాల్లో బాగా మిక్స్ చేస్తున్నారు. మీరు కొన్ని మిరియాల్లో బొప్పాయి గింజలు ఉన్నాయో లేవో ఇక వాటిని కాస్త నిశితంగా పరిశీలిస్తే తెలిసిపోతుంది. రుచి చూసినా కూడా తెలుస్తుంది.అలాగే లవంగాలు కూడా కల్తీ అవుతున్నాయి.ఈ లవంగాల నుంచి నూనెన తీసిన వాటిని కూడా మంచి వాటిలో కలుపుతున్నారు. ఇక ఇవి నాసీరకం లవంగాలు. వీటిని ఒరిజినల్ వాటిలో కలిపి జనాలను బాగా మోసం చేస్తున్నారు. వీటిని ఒక గిన్నెలో వేడి చేస్తే అవి ముడుచుకు పోతే ఖచ్చితంగా అవి నాసీరకం అని అర్థం చేసుకోవాలి.


అలాగే చక్కెరలో బేకింగ్ సోడా వేసి కల్తీ చేస్తున్నారు. అందుకే షాపుల్లో చక్కెరను కొన్నప్పుడు.. అది కల్తీ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి గ్లాస్ వాటర్ ని తీసుకుని ఇక అందులో టీ స్పూన్ చక్కెరను వేసి.. చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా కలపండి. అప్పుడు అందులో నురగలు కనుక కనిపిస్తే అది కల్తీదని అర్థం చేసుకోండి.అలాగే కొబ్బరి నూనె కల్తీ అయ్యిందో లేదో కనిపెట్టడం కూడా చాలా సులువు. ఇందుకోసం ఒక చిన్న గిన్నె ని తీసుకుని అందులో కొంచెం కొబ్బరి నూనెను పోసి కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టండి. అదంతా కూడా గడ్డ కడితే ఎలాంటి కల్తీ జరగలేదని అర్థం చేసుకోండి. అదే గడ్డ కట్టకపోతే ఖచ్చితంగా అది కల్తీ అయ్యిందని అర్థం చేసుకోండి. ఎందుకంటే కల్తీ నూనె అనేది గడ్డ కట్టదు.అలాగే పాలలో ఒక్కటేమిటీ ఎన్నో ఎన్నో కలుపుతుంటారు. కల్తీలేని స్వచ్ఛమైన పాలు దొరకడం ఈ రోజుల్లో చాలా కష్టమనే చెప్పాలి. అయితే ఈ కల్తీ పాలను గుర్తించడం అంత ఈజీ కాదు. అయితే మీరు కొన్న పాలను వేడి చేసేటప్పుడు అవి కాస్త పసుపు రంగులోకి మారినా అలాగే పాల రుచి కూడా తేడాగా అనిపించినా అవి ఖచ్చితంగా కల్తీ అయ్యాయని అర్థం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: