రోగాలను దూరం చేసే వంటిల్లు..ఎలా అంటే..?

Divya
ఆయుర్వేదం ప్రకారం రోగాలను దూరం చేసుకోవాలంటే వంటిల్లు అందుకు ఉత్తమమైనది అని చెప్పవచ్చు. ఇక ఇంట్లో ఉండే ఎన్నో రకాల ఔషధ మూలికల తో మన ఒంట్లో వుండే రోగాలను దూరం చేసుకోవచ్చు. వంటింట్లో దొరికే ఎలాంటి ఔషధాలతో ఇలాంటి రోగాలను దూరం చేసుకోవచ్చో మనం ఒకసారి ఇప్పుడు చదివి తెలుసుకుందాం.
నత్తి తో బాధపడుతున్న వారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు బిర్యానీ ఆకులు నోట్లో వేసుకుని నములుతూ పడుకుంటే నత్తి అనేది దూరమవుతుంది.కీళ్ల నొప్పులు , వాపులు , వాతం తగ్గాలంటే టేకు ఆకు పొడి మంచి ఔషధం అని చెప్పవచ్చు. చర్మరోగాలకు , అలర్జీలకు కాకరకాయ రసం ఉత్తమమైనది. అంతేకాదు మరెన్నో రోగాలకు కాకరకాయ రసం చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా డైట్ ఫాలో అవుతున్న వారు ప్రతిరోజూ పరగడుపున తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. సింధు రాది లేపనం ను ఎక్కువగా పుచ్చిపోయిన పళ్ళకి లేపనంగా ఉపయోగిస్తారు.. అంతే కాదు చర్మ సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తోంది.

పిల్లల్లో రక్త విరేచనాలు అవుతున్నప్పుడు ఆపిల్ జ్యూస్ ను తాగించడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఉలవ చారు,  ఉలవకట్టు , ఉలవ గుగ్గుళ్లు కూడా పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. లేత కాకరకాయలు తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. శరీరంలో వేడి అధికంగా ఉన్నవారు ప్రతిరోజు పెసరపప్పును తినడం వల్ల కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. పెసులను.. మొలకలు చేసుకొని తినడం వల్ల మంచి ఆరోగ్యం ప్రసాదించబడుతుంది. ఆవాలు చర్మ వ్యాధుల్ని పోగొట్టడమే కాకుండా చర్మానికి మంచి రంగును అందించడంలో సహాయపడుతుంది.  ఆవనూనెను బాగా మరిగించి,మరుగుతున్న నూనెలో గోరింటాకును వేసి..బాగా వేయించి, ఆ నూనెని వడపోసి సీసాలో దాచుకుని రోజు తలకి రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగడమే కాకుండా జుట్టు సమస్యలను దూరం చేసుకోవచ్చు. పెరుగును ప్రతిరోజూ తినడం వల్ల జీర్ణశక్తి మెరుగు పడి జీర్ణ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: