గుప్పెడు అటుకులతో ప్రయోజనాలు ఎన్నో..!!

Divya
అటుకులు.. వీటి గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ అటుకులతో ఉప్మా తయారు చేసుకొని ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటూ ఉంటారు. ఇకపోతే వడ్ల నుంచి వచ్చే అటుకులు రుచి ఎంత అద్భుతంగా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ మధ్యకాలంలో ఉత్తరాది వంటకాలు కూడా దక్షిణాదికి పాకినట్లు గా దక్షిణ భారత దేశంలో కూడా చాలామంది ఈ అటుకులతో పాయసం చేసుకోవడం, పులిహోర కలుపుకోవడం, ఉప్మా చేసుకోవడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సరికొత్త వంటకాలను సిద్ధం చేస్తున్నారు.

అయితే కేవలం గుప్పెడు అటుకులు తీసుకుంటే చాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు సైతం తెలియజేస్తున్నారు. ఇక అటుకుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయానికి వస్తే.. ప్రతిరోజు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ రూపంలో అడుగులు తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య ఉన్న వారికి త్వరగా ఉపశమనం కలుగుతుందట. ఎందుకంటే వీటిలో ఐరన్ పుష్కలంగా లభించడం వల్ల రక్తహీనత సమస్య సులువుగా దూరం అవుతుంది. అలాగే అటుకులలో కార్బోహైడ్రేట్స్ , ప్రోటీన్స్, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె కూడా లభిస్తాయి.. నీరసంగా ఉన్న వారు కూడా తినడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా పాలలో నానబెట్టి తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది.

ఎవరైతే బరువు తగ్గాలని భావిస్తున్నారో వారు తమ డైలీ డైట్ లో వీటిని చేర్చుకోవడంతో బరువు పూర్తిగా తగ్గవచ్చు . ఎందుకంటే అటుకుల్లో గ్లూకోజ్ , కొవ్వు పదార్ధాలు వంటివి ఉండవు.. ఫైబర్ పుష్కలంగా లభించడం వల్ల తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణం కావడంతో పాటు జీర్ణ సమస్యలు కూడా దూరమవుతాయి. ఇక అటుకుల్లో ఉండే యాంటిఆక్సిడెంట్స్ కారణంగా ఎన్నో భయంకరమైన వైరస్ లు కూడా శరీరం నుండి బయటకు వెళ్ళిపోయి.. పిల్లలకు, పెద్దలకు , గర్భిణీ స్త్రీలకు డయాబెటిస్ తో  బాధపడుతున్న వారికి గుండెజబ్బులు వున్న వారికి కూడా ఎంతో మేలు చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: