ప్రతిరోజు గుడ్డు తింటే డయాబెటిస్ వస్తుందా..?

Divya
సాధారణంగా గుడ్డు అనేది పోషకాహార నిధి అని చెప్పవచ్చు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఇష్టమైన అల్పాహారం కోడి గుడ్డు మాత్రమే. ఇక ఈ కోడి గుడ్డు లో ఎన్నో పోషకాలు ఉంటాయి.. కాబట్టి ప్రతి ఒక్కరూ రోజూ తింటే మంచి పోషకాలు మనకు అందుతాయని వైద్యులు చెబుతుంటారు. ఇకపోతే అప్పట్లో మాంసాహారులు మాత్రమే ఈ కోడి గుడ్డును తినడానికి ఇష్టపడే వారు కానీ ఇందులో ఉండే పోషకాలను గమనించిన తర్వాత శాఖాహారులు సైతం కోడిగుడ్లు తినడానికి అలవాటు పడిపోతున్నారు.

ఈ కోడిగుడ్డులో మనకు విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి తో పాటు ప్రోటీన్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. అందుకే చాలామంది ఈ ప్రోటీన్ల కోసమే ఎక్కువగా  ఈ కోడి గుడ్డు ను తింటూ ఉంటారు. అయితే గరిష్ట ప్రయోజనాల కోసం మనం ప్రతి రోజు కూడా ఒకటి లేదా రెండు కోడి గుడ్లను మాత్రమే తీసుకోవాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.. తాజాగా జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ఎవరైతే కోడిగుడ్లు అధికంగా తింటారో వారికి షుగర్ ప్రేరేపిస్తుంది అని తేలిందట. రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు.. ప్రతిరోజు తినే వారికి షుగర్ వచ్చే ప్రమాదం 60 శాతం పెరిగినట్లు సర్వేలో వెల్లడైంది.

అయితే ఈ సమస్య ఎక్కువగా పురుషుల కంటే మహిళల్లోనే ఉన్నట్లు పరిశోధకులు తేల్చారు.. ఇక  అధ్యయనం ఎవరు జరిపారనే విషయానికొస్తే ఖతార్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యం తో కలిసి చైనా మెడికల్ యూనివర్సిటీ వారు ఈ అధ్యయనం నిర్వహించగా ఇందులో రెండు కంటే ఎక్కువ గుడ్లు తినే వారిలో 25 శాతం మధుమేహం వచ్చే అవకాశం ఉంటుందట. ఇక క్రమం తప్పకుండా 50 గ్రాముల కంటే ఎక్కువ గుడ్లు తినే పెద్దవాళ్ళలో 60 శాతం వచ్చే ప్రమాదం ఉందని సమాచారం.

ఈ పరిశోధనలో 50 సంవత్సరాలకు పైబడిన వారిని.. చైనా నుంచి 8,545 మంది పెద్దలు చైనా హెల్త్ అండ్ న్యూట్రిషన్ లో కూడా పాల్గొన్నట్లు సమాచారం. కాబట్టి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక కోడిగుడ్డును తక్కువ మోతాదులో తీసుకోవడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: