టమాటాకు బదులుగా ఇవి వాడొచ్చట.. ఒకసారి ట్రై చేయండి?

praveen
మొన్నటి వరకు మార్కెట్లో ఉల్లి ధరలు ఎంత బెంబేలెత్తించాయో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు భారీగా పెరిగిపోయిన ఉల్లి ధరలు సామాన్యులు అందరికీ భారంగా మారి పోయాయ్. ఈ క్రమంలోనే ఉల్లి కోయకుండానే సామాన్యుడికి కన్నీళ్లు వచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం ఉల్లి ధరలు కాస్త తగ్గు ముఖం పట్టినప్పటికీ టమాటా ధరలు మాత్రం భారీగా పెరిగిపోవడం  తో ప్రస్తుతం సామాన్య ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. ఏకంగా ప్రస్తుతం టమాట ధర 100 రూపాయల నుండి 150 రూపాయల వరకు పలుకుతోంది.

 దీంతో సామాన్య ప్రజలు టమాట కొనుగోలు చేయాలంటేనే భయపడాల్సిన  పరిస్థితి ఏర్పడుతుంది  ఇక టమాట ధర ఎప్పుడు తగ్గుతుందా అది సామాన్య ప్రజలు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. టమాటా కు ప్రత్యామ్నాయం గా ఇంకా ఏదైనా ఉంటే బాగుండు అని ఎంతో మంది భావిస్తున్నారు.కానీ టమాటా కు ప్రత్యామ్నాయం లేదు అని భావించే చాలామంది ఒక వంద రూపాయలు కిలో అయినప్పటికీ కూడా జేబుకు చిల్లు పడుతున్నప్పటికీ టమాటా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

 అయితే ప్రస్తుతం టమాట ధరలు భారీగా పెరిగి  పోయిన నేపథ్యం లో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమం లోనే టమాటా కు ప్రత్యామ్నాయంగా కొన్ని రకాల పదార్థాలను ట్రై చేయవచ్చు అంటూ ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారి పోయింది. కూరలో పచ్చి మామిడి పొడిని ఒక టీ స్పూన్ వేస్తే అచ్చం టమాటా లాగే రుచి వస్తుందట. నీటిలో ఉసిరి ముక్కలను నానబెట్టి మెత్తగా పేస్టులా చేసుకుని కూరలో వాడినా కూడా టమాటా రుచి వస్తుందట. టమాటకు బదులుగా కాస్త పుల్లగా ఉండే పెరుగును కూడా వాడవచ్చు. అంతేకాదు కూర ఉడికేటప్పుడు కాస్తా చింతపండు గుజ్జు వేస్తే టమాటో తో పని ఉండదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: