ఇంగువ నీరు తాగడం ఆరోగ్యకరమా?

Vimalatha
భారతీయ వంటశాలలో వంటకాలకు రుచి, అద్భుతమైన వాసనను తీసుకురావడానికి వివిధ రకాల మసాలా దినుసులను ఉపయోగిస్తారు. ఇందులో ఇంగువ (అసఫోటిడా) కూడా ఉంటుంది. ఇంగువలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. అవన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే వంటకాలలో ఇంగువను వాడడమే కాకుండా ఇంగువ నీరు కూడా తాగొచ్చు. చిటికెడు ఇంగువను నీటితో కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
ఇంగువ వాటర్ ఎలా తయారు చేయాలి?
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకొని దానికి 1/2 స్పూన్ ఇంగువ పొడి వేసి ఖాళీ కడుపుతో తాగండి.
జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది
జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కోవడంలో ఇంగువ సహాయ పడుతుంది. ఇంగువను తీసుకోవడం వల్ల మీ జీర్ణవ్యవస్థ నుండి హానికరమైన విషపదార్థాలన్నింటినీ బయటకు పంపించేస్తుంది. ఇది అజీర్ణం వంటి సమస్యలను దూరం చేసి జీర్ణక్రియ ప్రక్రియను నియంత్రిస్తుంది. కడుపు pH స్థాయిని సాధారణ స్థితికి తీసుకువస్తుంది.
బరువు తగ్గడంలో సహాయ పడుతుంది
ఇంగువ వాటర్ మీ జీవక్రియను పెంచడంలో సహాయ పడుతుంది. అధిక జీవక్రియ రేటు అంటే మెరుగైన బరువు తగ్గడం. ఇంగువ వాటర్ తాగడం ద్వారా మీరు త్వరగా బరువు తగ్గవచ్చు. ఇది మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని నియంత్రణలో ఉంచుతుంది. మీ హృదయాన్ని ఏమాత్రం ప్రభావితం కానివ్వదు.
చలి నుండి రక్షిస్తుంది
శీతాకాలంలో చాలా త్వరగా జలుబు బారిన పడే వ్యక్తి అయితే ఇంగువ నీటిని తాగండి. ఇది శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తుంది. చలి నుండి రక్షిస్తుంది.
తలనొప్పిని తగ్గిస్తుంది
ఇంగువలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు తలనొప్పిని ఎదుర్కోవడంలో మీకు సహాయ పడతాయి. ఇది మీ తలలోని రక్తనాళాలలో వాపును తగ్గిస్తుంది. తలనొప్పి నుండి ఉపశమనం పొందడానికి ఇంగువ నీరు త్రాగండి.
పీరియడ్స్ నొప్పి నుండి ఉపశమనం
కొన్నిసార్లు పీరియడ్స్ నొప్పిని ఎదుర్కోవడం చాలా కష్టం అవుతుంది. వెన్నెముక, పొత్తి కడుపు నొప్పిని వదిలించుకోవడానికి ఇంగువ ఒక గొప్ప నివారణ. శరీరంలో రక్తం సజావుగా ప్రవహించడంలో ఇంగువ సహాయ పడుతుంది. ఇది పీరియడ్స్ నొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది. పీరియడ్స్ సమయంలో ఉపశమనం పొందడానికి ఇంగువ వాటర్ తాగండి.
రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది
ఇంగువ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో మీకు సహాయ పడుతుంది.
అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయ పడుతుంది
ఇంగువలో రక్తం గడ్డ కట్టడాన్ని నిరోధించే పదార్థాలు ఉన్నాయి. ఇది శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగు పరచడంలో, రక్తపోటును నియంత్రించడంలో సహాయ పడుతుంది. మజ్జిగలో కూడా ఇంగువ వేసి తాగొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: