ఈ సింపుల్ టెక్నీక్‌తో శృంగార సామర్థ్యం పెంచుకోండి ?

VUYYURU SUBHASH

మానవ జీవితంలో ఆకలి , దప్పిక, నీరు , నిద్ర ఎంత అవసరమో... శృంగారం కూడా అంతే అవసరం. దాంపత్య జీవితం చక్కగా ఉంది అని చెప్పాలంటే అందులో శృంగారం కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. మారుతున్న జీవన పరిస్థితుల కారణంగా ప్రస్తుతం మనుషుల్లో లైంగిక సామర్థ్యం క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. మానసిక శారీరక ఒత్తిళ్లు కూడా ఇందుకు ఓ కారణం కావచ్చు. అయితే లైంగిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు చాలా సింపుల్ చిట్కాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడి - ఆందోళనకు దూరంగా ఉండడంతో పాటు శృంగార సామర్థ్యాన్ని పెంచే ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బాదం, జీడిపప్పు, అక్రోట్స్ లాంటి నట్స్ రెగ్యుల‌ర్‌గా తీసుకుంటే శృంగార‌ సామర్థ్యం పెరుగుతుంది. వీటిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచే గుణాలు పుష్క‌లంగా ఉంటాయ‌ట‌.
సెలీనియం, జింక్ లాంటి పోష‌కాలు ఇందులో ఉంటాయ‌ట‌. ఇవి లైంగీక సామ‌ర్థ్యాన్ని పెంచుతాయ‌ని అంటున్నారు. ఇక ఇవి మెద‌డులో ఉత్ప‌త్తి చేసే డొపమైన్ వల్ల సెక్స్ కోరికలు పెరుగుతాయ‌ని శృంగార నిపుణులు చెపుతున్నారు. ఇక కోడి గుడ్లు కూడా క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకుంటే శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంద‌ట‌. వీటిల్లో ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయ‌ట‌. అందువ‌ల్ల వీటి ద్వారా అలసట దూరమై శృంగార జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయ‌వ‌చ్చ‌ని అంటున్నారు.ఇక పురుషులులో ఒత్తిళ్లు, వ‌య‌స్సు పై బ‌డ‌డం వ‌ల్ల అంగ స్తంభనలోపం ఎక్కువుగా ఉంటుంది.
అయితే దీని నుంచి త‌ప్పించుకునేందుకు స్ట్రాబెర్రీ గింజ‌లు ఎక్కువుగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ గింజల్లో జింక్ ఎక్కువ మోతాదులో ఉండ‌డంతో ఇది వీర్యం ఉత్పత్తికి అవసరమైన పురుష హార్మోన్ టెస్టోస్టిరాన్‌ను నియంత్రిస్తుంద‌ట‌. దీని వ‌ల్ల సెక్స్ కోరిక‌ల ఉద్దీప‌న జ‌రుగుతుంద‌ని సెక్సాల‌జిస్టులు చెపుతారు. ఇక కాఫీలోని మెటాబాలిజం కూడా ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగు ప‌ర‌చి లైంగీక సామ‌ర్థ్యం పెంపుద‌ల‌కు ప‌రోక్షంగా తోడ్ప‌డుతుంద‌ట‌. మిరప తినగానే ముఖం ఉబ్బుతుంద‌ట‌. అంటే ర‌క్త నాళాలు విస్త‌రించి.. పురుషాంగానికి ర‌క్తం స‌ర‌ఫ‌రా ఎక్కువుగా జ‌రుగుతుంద‌ట‌. వీటితో పాటు  ఉల్లి, వెల్లుల్లిలో కూడా శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే గుణాలు ఉంటాయ‌ని చెపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: