పొడి దగ్గు తగ్గాలంటే ఇలా చేస్తే చాలు ?

Divya

కరోనా విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎవరైతే కరోనా బారిన పడ్డారో అలాంటివారి పరిస్థితి తీవ్ర అస్వస్థత గా మారుతోంది. అంతేకాకుండా కరోనా సోకిన వారికి పొడి దగ్గు విపరీతంగా బాధిస్తోందని పలువురు వాపోతున్నారు. అయితే ఈ పొడి దగ్గు రావడం వల్ల ధమనులలో పూర్తిస్థాయి నొప్పి రావడం మొదలవుతుంది. అయితే ఈ పొడి దగ్గు ను తగ్గించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది అంటున్నారు నిపుణులు. ఇక ఈ చిట్కాలు ఏమిటో?  వాటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..
పొడి దగ్గు, గొంతు నొప్పి రెండూ విపరీతంగా ఉన్నప్పుడు 10 మిరియాలు, ఐదు లవంగాలు, రెండు చెక్క, తులసి ఆకులు 10 నుంచి 15, పసుపు చిటికెడు, అల్లం చిన్న ముక్క, బెల్లం రుచికి సరిపడినంత.. వీటన్నింటిని బాగా దంచి , పావు లీటర్ నీటిలో వేసి బాగా మరిగించాలి. ఇలా బాగా మరిగిన ద్రావణాన్ని వడకట్టి, తాగడం వల్ల ఒకటి రెండు రోజుల్లోనే పొడి దగ్గు , గొంతు నొప్పి తగ్గడం ఖాయం..

అర టేబుల్ స్పూన్ శొంఠి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ తేనెలో కలిపి తీసుకోవడం వల్ల త్వరగా పొడి దగ్గు తగ్గుతుంది.
చిటికెడు పసుపు, నిమ్మరసం, తేనె  కలిపిన మిశ్రమాన్ని మూడుపూటలా తీసుకోవడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.
కరక్కాయను బుగ్గన పెట్టుకుని రసం మింగినా త్వరగా ఉపశమనం కలుగుతుంది.
రోజుకొకసారి తమలపాకులు నమలడం వల్ల దగ్గు తగ్గుతుంది. అయితే తమలపాకులు నమలేటప్పుడు కేవలం తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవడం మంచిది..
పొడి దగ్గుతో బాధపడుతుంటే అర టీ స్పూన్ ఇంగువపొడి, ఒక టీ స్పూన్ తాజా అల్లం రసం, ఒక టేబుల్ టీ స్పూన్ తేనె అన్నింటినీ  బాగా కలిపి, ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల దగ్గును తగ్గించుకోవచ్చు.
పాలలో మిరియాల పొడిని వేసుకొని తాగితే దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.
కాబట్టి ఎవరైనా పొడి దగ్గుతో బాధపడుతుంటే, ఈ వంటింటి చిట్కాలు ఉపయోగించి త్వరగా  ఉపశమనం పొందవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: