ఉసిరి వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..

Satvika
ఉసిరి కాయలు.. ఈ పేరు వినగానే చాలా మందికి నోరు ఊరుతుంది.. ఎందుకంటే వగరుగా, కాస్త పుల్లగా ఉన్న ఈ కాయలను ఉప్పు, కారం వేసుకొని చాలా మంది తింటారు. అయితే, వీటిని తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తీ పెరుగుతుందట.
ఇప్పుడు అతి వేగంగా ప్రబలుతున్న కరోనా మహమ్మారి నుంచి బయట పడాలంటే సి విటమిన్ తప్పనిసరి.. సి విటమిన్ ట్యాబ్లెట్ ల ద్వారా కరోనా నుంచి కోలుకుంటున్నారు. అయితే, ఈ విటమిన్‌ కోసం టాబ్లెట్‌ వాడటం కన్నా ఉసిరి కాయను నేరుగా లేదా పొడి రూపంలో తీసుకుంటే మేలని సలహా ఇస్తున్నారు. అందువల్లే ఉసిరికి ప్రపంచ దేశాల్లో గిరాకీ పెరిగింది. రాష్ట్రంలో విరివిగా లభించే ఉసిరి కాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఇది వైరస్‌లను నివారిస్తుంది.

ఇకపోతే ఉసిరి వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు, రక్త కణాల హీనతను తగ్గించడంతో పాటు జీర్ణశక్తిని పెంచుతుంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఇదొక బూస్టర్‌గా పని చేస్తుందని వైద్యులు ఇటీవల పరిశోధనల ద్వారా తేల్చి చెప్పారు..
ఉసిరి వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో ఇప్పుడు చూద్దాం..
విటమిన్‌ సి, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, బీ-కాంప్లెక్స్‌తోపాటు ఇతర విటమిన్లు, ఖనిజాలు ఉసిరిలో ఎక్కువ. చక్కెర వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఉసిరి దివ్య ఔషధంగా పేర్కొంటున్నారు. ఇందులో ఉండే క్రోమియం చక్కెర వ్యాధిని అదుపులో ఉంచేందుకు తోడ్పడుతుంది. గుండె కవాటాలు మూసుకుపోకుండా క్రోమియం నివారిస్తుంది. ఆయుర్వేదంలో ఉసిరి వినియోగం చాలా ఎక్కువ.. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు మార్కెట్ లలో ఉసిరి పొడి కూడా దొరుకుతుంది. రోజూ ఒక స్పూన్ పొడి తో తేనె కలిపి తీసుకుంటే శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు నయం అవుతాయి..
ఒకప్పుడు శీతాకాలంలో మాత్రమే దొరికే ఉసిరి కాయలు ఇప్పుడు అన్ని కాలాలలోనూ లభిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడా, దక్షిణ కొరియా, హాంకాంగ్, మలేషియా, ఫ్రాన్స్, లెబనాన్, స్విట్జర్లాండ్, స్వీడన్, జపాన్, నార్వే, డెన్మార్క్, చెక్‌ రిపబ్లిక్, ఆస్ట్రియా తదితర దేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతోంది.. ఇప్పుడు ఇండియాలోనే వీటి వినియోగం భారీగా పెరిగింది..చూసారుగా ఉసిరి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని.. ఇప్పటి నుంచి మీరు కూడా ఉసిరి కాయలను తినడం అలవాటు చేసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: