ఈ ఆకులతో డయాబెటిస్ కు చెక్ పెట్టవచ్చా?

Divya

ప్రపంచంలో చాలా మంది వయసు పైబడిన వారు డయాబెటిస్ బారిన పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా  25 సంవత్సరాలు నిండిన యువకులు కూడా , డయాబెటిస్ బారిన పడుతుండటం అందరికీ విచారకరంగా మారింది. అయితే ఇది చిన్న సమస్యగా పరిగణించలేము. ఎందుకంటే దీర్ఘకాలికంగా మన శరీర అవయవాలు అన్నింటినీ దెబ్బతీస్తుంది. క్రమంగా చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువ. ఇటీవల కాలంలో చాలామంది కరోనా బారిన పడి చనిపోయిన రోగులలో డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు ఎక్కువగా ఉండటం గమనార్హం.

అయితే ఇప్పుడు చెప్పబోయే ఒక ఆకుల రసాన్ని కనుక వాడితే డయాబెటిస్ కు చెక్ పెట్టవచ్చు అని అంటున్నారు నిపుణులు. ఆ ఆకు ఏదో కాదు.. గుర్మార్. ఈ ఆకుల రసంతో డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చు. ఈ గుర్మార్ ఆకులలో యాంటీఆక్సిడెంట్ గుణాలు, యాంటీ డయాబెటిక్ లక్షణాలు, యాంటీ అథెరోస్క్లెరోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజూ వీటిని తినడం వల్ల డయాబెటిస్ తో పాటు ఇతర అనారోగ్య సమస్యలకు సైతం చెక్ పెట్టవచ్చు.

అలాగే టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులు కూడా  గుర్మార్ ఆకులు తీసుకోవడంతో శరీరంలో తీపి రుచి తగ్గుతుంది . ఖాళీ కడుపుతో గుర్మార్ ఆకులను తీసుకుంటే మంచిది. ఈ ఆకులు తిన్న తరువాత నీటిని తీసుకోవడం ద్వారా చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచగలిగే శక్తి ఈ గుర్మార్ ఆకులకు ఉంది. అంతేకాకుండా కామెర్ల చికిత్సకు  కూడా ఈ ఆకులను వినియోగిస్తారు. ఉబ్బసం, కంటి సమస్య, మలబద్ధకం, అజీర్ణం, సూక్ష్మజీవుల సంక్రమణ, కార్డియోపతి, హైపర్‌ కొలెస్టెరోలేమియా  వంటి సమస్యలను కూడా దూరం చేయగల శక్తి ఈ ఆకులకు ఉంది..

అయితే ఈ ఆకులను ఎలా ఉపయోగించాలి అంటే, మొక్క నుండి ఆకులను సేకరించిన తర్వాత శుభ్రంగా కడిగి, ఈ ఆకులను మెత్తగా చూర్ణం లాగా చేసి, ఒక వస్త్రం  లో పెట్టి గట్టిగా పిండాలి. తద్వారా రసం వస్తుంది. ఈ రసాన్ని ప్రతి రోజూ తాగడం వల్ల డయాబెటిస్ కు  చెక్ పెట్టవచ్చు అని అంటున్నారు  ఆయుర్వేద నిపుణులు. ఈ కరోనా లో చాలా మంది డయాబెటిస్ రోగులు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో ఈ ఆకులు కొంతవరకు ఉపశమనం కలిగిస్తాయి అని కూడా వారు యోచిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: