కని కరోనా: ఇలా చేస్తే కరోనా సోకదు.. అని అంటున్న నమ్రత...!

Divya

కరోనా వల్ల ఎంతోమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు . శాస్త్రవేత్తలు , వైద్యుల అంచనాలను మించి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది కరోనా. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసుల వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వైరస్ సోకకుండా ప్రజలు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నారు. మరికొందరైతే కరోనా వైరస్ బారిన పడకుండా ఇంటికే పరిమితమవుతున్నారు. అంతేకాకుండా ఇంట్లో ఒకరికి సోకిన మిగిలిన వారందరికీ కూడా కరోనా బారిన పడవలసి వస్తుంది.
అయితే  ప్రస్తుతం హీరో మహేష్ బాబు భార్య  నమ్రత, కరోనా  వైరస్ సోకకుండా, సోకిన వ్యక్తి త్వరగా కోలుకునేలా కొన్ని టిప్స్ చెబుతోంది. ఆ టిప్స్ ఇప్పుడు  నెట్టింట్లో వైరల్ గా మారాయి.
1). ఎవరైతే ప్రతి రోజు ఎక్సర్సైజులు చేస్తారో వాళ్లకు , కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నమ్రత తెలిపారు. అంతేకాకుండా ఎక్సర్సైజులు చేసే వాళ్లకు కరోనా సోకినా, వాళ్ళు త్వరగా వైరస్ నుంచి కోలుకుంటారని నమ్రత పేర్కొన్నారు.
2). ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరానికి శ్రమ కలుగుతుంది. తద్వారా కరోనా నుంచి బయటపడడం తేలిక అని నమ్రత తెలిపింది.
ప్రతిరోజు ఈ రెండు పద్ధతులను పాటించడం వల్ల కరోనా ని త్వరగా నియంత్రించవచ్చని నమ్రత ట్విట్టర్ ద్వారా తెలిపింది. ప్రతి రోజు ఉదయం వ్యాయామం, యోగా లాంటివి చేస్తూనే, ఉదయం 7 గంటల నుండి ఎనిమిది గంటల వరకు సూర్యరశ్మిని ఆస్వాదించేలాగ ఉండాలి. అప్పుడే సూర్యరశ్మి మన శరీరానికి తగిలి, మన శరీరానికి డి విటమిన్ బాగా లభిస్తుంది. తద్వారా రోగనిరోధక శక్తి పెరిగి, కరోనా నుండి బయటపడే శక్తి మనకి వస్తుంది.

ఇక కరోనా వైరస్ కారణంగా సినీ ఇండస్ట్రీ చాలా ఆర్థికంగా దెబ్బ తింటోంది, ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమాలు చాలా వాయిదా పడ్డాయి.. మహేష్ నటిస్తున్న సర్కారీ వారి పాట సినిమాపై కూడా కరోనా ప్రభావం బాగానే పడుతోంది. దాదాపు మూడు నెలల వరకు ఇదే స్థాయిలో కరోనా  కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు చెప్పుకొస్తున్నారు. అయితే షూటింగు ఎప్పుడు మొదలవుతాయో, ఏమో చూడాల్సి ఉంది.
https://www.instagram.com/namratashirodkar/?utm_source=ig_embed

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: