జాజికాయ పొడి తో నోటి దుర్వాసన మాయం.. ఎలాగంటే..?

kalpana
 ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో సమయం సరిపోక తొందరగా తొందరగా తినేది వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా రాత్రిపూట తిన్న ఆహారం వల్ల నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది. రాత్రి తిన్న తర్వాత వాటిని శుభ్రం చేసుకోకపోవడం వల్ల దుర్వాసన పెరిగిపోతూ ఉంటుంది. ఈ వాసన పోవడానికి ఎన్ని పేస్టులు  వాడిన వాసన మాత్రం అలాగే వస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో జాజికాయ పొడి వాడటం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. అది అనేక వంటల్లో కూడా వాసన కోసం  వేస్తుంటారు. అలాగే మంచి రుచి కూడా వస్తుంది. అంతేకాకుండా జాజికాయ వాడటం  వల్ల ఇక ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆ ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
 జాజికాయ పొడి తో సూప్ చేసుకొని తాగడం వల్ల విరేచనాలు, మలబద్ధకం, గ్యాస్ జీర్ణ  సంబంధ సమస్యలు తగ్గడమే కాకుండా శరీరంలోని ద్రవాలు సమ్మర్ జిల్లలో ఉండేటట్లు చేస్తాయి.
 కొలెస్ట్రాల్ తగ్గిపోవడానికి జాజికాయ పొడిని నిత్యం తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా రక్తనాళాలలో పేరుకుపోయి నా కొవ్వు కూడా కరిగిపోతుంది. ఫలితంగా గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.
 జాజికాయ పొడిని వాడడం వల్ల దంతాల సమస్యలు తగ్గుతాయి. నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. అంతేకాకుండా లివర్, కిడ్నీలో పేరుకుపోయిన వెంటనే పదార్థాలను బయటకు పంపిస్తుంది.
 రోజూ రాత్రి పడుకోబోయే ముందు జాజికాయ పొడిని తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తొలగిపోయి.  నిద్ర హాయిగా పడుతుంది.
 కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వాళ్లు జాజికాయ  నూనె బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే జాజి కాయలు క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, పొటాషియం, వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కాబట్టి శరీరానికి కావలసిన పోషణ లభించడమే కాకుండా రక్తం సక్రమంగా సరఫరా జరగడానికి బాగా ఉపయోగపడుతుంది.జాజికాయను పొడిగొట్టి, అతి స్వల్ప పరిమాణంలో వాడినట్లయితే, కొన్ని అనారోగ్యాలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. తాంబూలంలో జాజికాయను వేసుకుని సేవిస్తే నోటి దుర్వాసనను పోగొడుతుంది. పంటిమీద నలుపునూ, గారను తొలగించి, పళ్ళు మెరిసేలా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: