ఈ జ్యూస్ లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది...

Purushottham Vinay

నిత్యం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి ఈ జ్యూస్ లు తాగండి..బీట్ రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది.ఆక్సిజన్ లెవెల్స్‌ని పెంచే శక్తి బీట్‌రూట్‌కి ఉంది. శరీరంలోని విష వ్యర్థాలను తొలగించే గుణం కూడా ఉంది. ఇది తాగడం వలన రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. అంతే కాక చర్మ సమస్యలు రాకుండా ఇది మేలు చేస్తుంది.ప్రతి రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగితే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. మొటిమలు వంటి సమస్యలకు మంచి రిజల్ట్ ఇస్తుంది. పచ్చి బీట్‌రూట్ జ్యూస్ తాగితే మంచిది. ఇలా తాగ లేని వారు బీట్‌రూట్‌ను స్లైసెస్‌గా కట్ చేసుకుని పాల కూరను చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్స్ చేసి సలాడ్‌గా తీసుకోవచ్చు. బీట్‌రూట్, పాలకూర, టమాట కలిపి మిక్స్ చేసి జ్యూస్‌గానూ తీసుకోవచ్చు.
బొప్పాయి పండు రసం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఉండే విటమిన్ సి.. చర్మంలోని మలినాలను తొలగించి మంచి ఆరోగ్యాన్ని శక్తిని ఇస్తుంది. బోప్పాయి పండు తరచూ తీసుకుంటే ఆరోగ్యంగా ఉండి జీవిత ఆయుషు
పెరుగుతుంది. నేరుగా బొప్పాయి ముక్కలు తినాలంటే కొంతమందికి సహించదు. ఇటువంటి వారు బొప్పియిని గుజ్జులా చేసుకుని అందులో కొంచెం బాదం పాలు, తేనె, క్యారెట్ ముక్కలు మిక్స్ చేసి జ్యూస్ చేసి తాగొచ్చు. లేదా సలాడ్‌లా చేసుకుని తీసుకోవచ్చు.
ఇక గుమ్మడికాయ జ్యూస్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.ఇందులో ఉండే రిబోఫ్లేవిన్, నియాచిన్, బి6 లాంటివి బ్లడ్ సర్క్యులేషన్‌ను క్రమబద్ధీకరిస్తాయి. ఫలితంగా అజీర్తి సమస్యలు దరి చేరవు. జీర్ణం బాగా అవుతుంది. అంతేకాకా చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ముడతలు పడకుండా కాపాడతుంది. అందుకే వారానికి ఓ సారైనా గుమ్మడి కాయ జ్యూస్ తాగితే మంచిది.ఇక ఈ మూడు రకాల జ్యూస్ లను క్రమం తప్పకుండ రెగ్యులర్ గా తాగండి. సంపూర్ణ ఆరోగ్యంగా వుంటారు. ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫోలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: