డయాబెటిస్ రోగులు చిన్న ఉసిరి కాయలు తినవచ్చా..?

Divya

ప్రస్తుత కాలంలో చిన్న పెద్దా అనే తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు అవుతున్నారు. అయితే ఒకసారి డయాబెటిస్ వచ్చిన తర్వాత అది జీవితాంతం ఉంటుంది. అయితే డయాబెటిస్  ను పూర్తిగా తొలగించలేము, కానీ కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే ఈ డయాబెటిస్ కారణంగా కొంతమంది అకాల బరువు తో బాధపడితే, మరికొంతమందిలో పాదాలలో మంటలు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఏది ఏమైనా ఇవ్వడానికి పెట్రోలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఎప్పటికప్పుడు వారు తినే ఆహారంలో ఎన్నో రకాలు అపోహలు కూడా ఉన్నాయి. అవి తింటే షుగర్ వస్తుంది. ఇవి తింటే షుగర్ వస్తుంది.. అంటూ చాలా మంది ఏం తినాలో తెలియక సతమతమవుతూ ఉంటారు.

అయితే ఇందులో ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయేది చిన్న ఉసిరి కాయలు. ఈ చిన్న ఉసిరి కాయ తినడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుందా.. లేదా.. అని చాలామంది భ్రమలో ఉన్నారు. అయితే దీనికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ చిన్న ఉసిరికాయలను డయాబెటిస్ రోగులు తినవచ్చు. వారికి ఎలాంటి ప్రమాదం ఉండదు. చిన్న ఉసిరి కాయలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. అయితే వీటిని తినేటప్పుడు డయాబెటీస్ రోగులు వారు ఉపయోగించే టాబ్లెట్లను బట్టి ఆరోగ్య సంరక్షకులు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.

అయితే ఇందులో పెద్ద ఉసిరికాయలు కూడా ఉంటాయి. పెద్ద ఉసిరి కాయలు తినడం వలన మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఆపిల్ లో ఉండే ప్రోటీన్ ల కంటే ఈ ఉసిరి కాయల్లో మూడింతలు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక దానిమ్మ పండు తో పోలిస్తే ఏకంగా 27 రెట్లు అధిక పోషకాలు ఉన్నాయని ఒక అధ్యయనం ద్వారా తెలిసింది. ఉసిరిలో ముఖ్యంగా యాంటీవైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలున్నాయి. ఉసిరికాయ రక్తప్రసరణను పెంచి, శరీరంలో అధికంగా పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించి వేస్తుంది. అంతేకాకుండా మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే గుండె సంబంధిత వ్యాధులు కూడా దరిచేరవు. ఇక జుట్టు సంరక్షణకు చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: